Soodamu yidiyu nokkasodyamu nemdu

చూతము యిదియు నొక్కసోద్యము నేఁడు
Language

(॥పల్లవి॥)
చూతము యిదియు నొక్కసోద్యము నేఁడు
వాతులు మోచిన మనవావులేమి సేసీనో

(॥చూతము॥)
నీవు చేవట్టి తియ్యఁగా నేఁ గోపగించుకోఁగా
యీవల చెలులు నవ్వేరిది చూచి
కావరము నీకుఁ బట్టె కడుఁజలము నాకంటె
లావుకై యిద్దరివలపులేమి సేసీనో

(॥చూతము॥)
కప్పురము నీవియ్యఁగా కాఁకలు నేఁ జల్లఁగాను
తప్పక చిలుకలు సైతము నెంచీని
దప్పిదేరె నీమోవితనువు నాకునలసె
యిప్పుడే మదను డింకనేమి సేసీనో

(॥చూతము॥)
చన్నులు నీ వంటఁగాను సమ్మతించి నే నుండఁగా
పన్నిన పంచబాణాలు పంతమిచ్చీని
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టె
యెన్నరాని తమకము లివి యేమి సేసీనో

(||pallavi||)
sūdamu yidiyu nŏkkasodyamu nem̐ḍu
vādulu mosina manavāvulemi sesīno

(||sūdamu||)
nīvu sevaṭṭi tiyyam̐gā nem̐ gobagiṁchugom̐gā
yīvala sĕlulu navveridi sūsi
kāvaramu nīgum̐ baṭṭĕ kaḍum̐jalamu nāgaṁṭĕ
lāvugai yiddarivalabulemi sesīno

(||sūdamu||)
kappuramu nīviyyam̐gā kām̐kalu nem̐ jallam̐gānu
tappaga silugalu saidamu nĕṁchīni
dappiderĕ nīmovidanuvu nāgunalasĕ
yippuḍe madanu ḍiṁkanemi sesīno

(||sūdamu||)
sannulu nī vaṁṭam̐gānu sammadiṁchi ne nuṁḍam̐gā
pannina paṁchabāṇālu paṁtamichchīni
yinniḍā śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭĕ
yĕnnarāni tamagamu livi yemi sesīno