చూతము నీనేరుపు సుదతియెదుట నేఁడు
(॥పల్లవి॥)
చూతము నీనేరుపు సుదతియెదుట నేఁడు
కాతరీఁడ వీగుట్టు కనుకొనవయ్యా
(॥॥)
పడఁతి మాఁటలనే బయలువందిలి వెట్టె
జడియక నీవది విచారించవయ్యా
వెడఁగు నవ్వులనే వెన్నెలలు వెదవెట్టె
కడలేక పోదిసేయఁ గదవయ్యా
(॥॥)
కుమ్మరింపుఁ జూపులనే కుచ్చె నీలాలుపేరులు
కమ్మి యిట్టె నీవు మెడఁ గట్టుకోవయ్యా
బొమ్మల జంకెనలనే పొదిగి ముసుఁగువెట్టె
పిమ్మటఁ దెలిసి తప్పించుకొనవయ్యా
(॥॥)
జవ్వనమదములు సరుస రాసులువోసె
చివ్వన నింతటనై నా చేపట్టవయ్యా
రవ్వగా శ్రీవేంకటేశ రమణిఁ గూడితి విటు
ఇవ్వల మమ్మేలితివి ఇట్టె మెచ్చవయ్యా
(||pallavi||)
sūdamu nīnerubu sudadiyĕduḍa nem̐ḍu
kādarīm̐ḍa vīguṭṭu kanugŏnavayyā
(||||)
paḍam̐ti mām̐ṭalane bayaluvaṁdili vĕṭṭĕ
jaḍiyaga nīvadi visāriṁchavayyā
vĕḍam̐gu navvulane vĕnnĕlalu vĕdavĕṭṭĕ
kaḍalega podiseyam̐ gadavayyā
(||||)
kummariṁpum̐ jūbulane kuchchĕ nīlāluberulu
kammi yiṭṭĕ nīvu mĕḍam̐ gaṭṭugovayyā
bŏmmala jaṁkĕnalane pŏdigi musum̐guvĕṭṭĕ
pimmaḍam̐ dĕlisi tappiṁchugŏnavayyā
(||||)
javvanamadamulu sarusa rāsuluvosĕ
sivvana niṁtaḍanai nā sebaṭṭavayyā
ravvagā śhrīveṁkaḍeśha ramaṇim̐ gūḍidi viḍu
ivvala mammelidivi iṭṭĕ mĕchchavayyā