చూతము నీబలుములు సుద్దు లింతే సేమిటికి
(॥పల్లవి॥)
చూతము నీబలుములు సుద్దు లింతే సేమిటికి
పొతరము చూపరాదా పొరుగువారి పయిని
(॥॥)
పలుమారు నవ్వేవు పైఁ జెయ్యివేసేవు
చలములే సేసేవు సారెసారెకు
వలపు నీకు బాఁతైతే వద్దనున్న కాంతలఁ
మొలకచన్నులమీఁద మోపరాదా గోరు
(॥॥)
భావించి చూచేవు పంతములాడుకొనేవు
కావరించి పెనఁగేవు గర్వానను
లా వింత నీకుఁ గలితే లలితో వారసతులఁ
మోవులపైఁ బల్లుమోపి ముట్టరాదా కొప్పులు
(॥॥)
సరసమూలాడేవు చనవిచ్చి కూడేవు
విరుల వేసేవు శ్రీ వేంకటేశుఁడా
మరిగితి నలమేలుమంగను నేనూవూడిగపుఁ
తరుణులతొడలపై తాచరాదా పాదాలు
(||pallavi||)
sūdamu nībalumulu suddu liṁte semiḍigi
pŏdaramu sūbarādā pŏruguvāri payini
(||||)
palumāru navvevu paim̐ jĕyyivesevu
salamule sesevu sārĕsārĕgu
valabu nīgu bām̐taide vaddanunna kāṁtalam̐
mŏlagasannulamīm̐da mobarādā goru
(||||)
bhāviṁchi sūsevu paṁtamulāḍugŏnevu
kāvariṁchi pĕnam̐gevu garvānanu
lā viṁta nīgum̐ galide lalido vārasadulam̐
movulabaim̐ ballumobi muṭṭarādā kŏppulu
(||||)
sarasamūlāḍevu sanavichchi kūḍevu
virula vesevu śhrī veṁkaḍeśhum̐ḍā
marigidi nalamelumaṁganu nenūvūḍigabum̐
taruṇuladŏḍalabai tāsarādā pādālu