Soodamu nee nija mellaa soridi nem damdulone

చూతము నీ నిజ మెల్లా సొరిది నేఁ డందులోనే
Language

(॥పల్లవి॥)
చూతము నీ నిజ మెల్లా సొరిది నేఁ డందులోనే
ఆతల నాలికెను ము క్కంటుకొనరాదా

(॥చూతము॥)
కామించి యాపెచన్నులు కరముల నంటనని
నా మోము దప్పక చూచి నగరాదా
ఆమనిమోవితేనెల కాసపడ నని నీవు
ప్రేమపు టాపెపై నాన పెట్టుకోరాదా

(॥చూతము॥)
అంగనపొత్తున నీవు ఆరగించ నని వుమి
మింగక యే డడుగులు మెట్టరాదా
సంగతి నాకె కౌఁగిలి సమరతి సేయనని
చెంగట మరునికినీ చెయ్యెత్తరాదా

(॥చూతము॥)
పైకొని మీ రిద్దరు బాసలు సేసుకోమని
యీకడ లావణ్యవార్ధి నీఁదరాదా
చేకొని న న్నేలితివి శ్రీవేంకటేశుఁడ
తూకొన్న వలపులను తులఁదూఁగరాదా

(||pallavi||)
sūdamu nī nija mĕllā sŏridi nem̐ ḍaṁdulone
ādala nāligĕnu mu kkaṁṭugŏnarādā

(||sūdamu||)
kāmiṁchi yābĕsannulu karamula naṁṭanani
nā momu dappaga sūsi nagarādā
āmanimovidenĕla kāsabaḍa nani nīvu
premabu ṭābĕbai nāna pĕṭṭugorādā

(||sūdamu||)
aṁganabŏttuna nīvu āragiṁcha nani vumi
miṁgaga ye ḍaḍugulu mĕṭṭarādā
saṁgadi nāgĕ kaum̐gili samaradi seyanani
sĕṁgaḍa maruniginī sĕyyĕttarādā

(||sūdamu||)
paigŏni mī riddaru bāsalu sesugomani
yīgaḍa lāvaṇyavārdhi nīm̐darādā
segŏni na nnelidivi śhrīveṁkaḍeśhum̐ḍa
tūgŏnna valabulanu tulam̐dūm̐garādā