Soodamu nee nerubulu sudadu limdarilona

చూతము నీ నేరుపులు సుదతు లిందరిలోన
Language

(॥పల్లవి॥)
చూతము నీ నేరుపులు సుదతు లిందరిలోన
యేతులు నాతో నెంచనేఁటికే నీవు

(॥చూత॥)
నాతో విభుఁడు నవ్వితే నను నేల దూరేవు
ఆతనిదే యేమైనా నాడవే నీవు
యీతల నాకు వలచి ఇంటికిఁ బోకుండితేను
నీతు లేమైనాఁ గొన్ని నేరుపవే నీవు

(॥చూత॥)
చక్కఁగా నామాటకు జవదాఁటకుండితేను
చెక్కునొక్కి కొంత బుద్ది చెప్పవే నీవు
మక్కువ నామీఁది బత్తి మరిగి పాయకుండితే
దిక్కుల నాతని వోజ దిద్దవే నీవు

(॥చూత॥)
ఇత్తల శ్రీవేంకటేశుఁ డేలె నీ కబ్బితే
చిత్తము గరఁగ సన్న సేయవే నీవు
హత్తి సేసవెట్టి పెండాడినాఁ డీఁతడు నేఁడు
కొత్త లేల యిఁక నియ్యకొనవే నీవు

(||pallavi||)
sūdamu nī nerubulu sudadu liṁdarilona
yedulu nādo nĕṁchanem̐ṭige nīvu

(||sūda||)
nādo vibhum̐ḍu navvide nanu nela dūrevu
ādanide yemainā nāḍave nīvu
yīdala nāgu valasi iṁṭigim̐ boguṁḍidenu
nīdu lemainām̐ gŏnni nerubave nīvu

(||sūda||)
sakkam̐gā nāmāḍagu javadām̐ṭaguṁḍidenu
sĕkkunŏkki kŏṁta buddi sĕppave nīvu
makkuva nāmīm̐di batti marigi pāyaguṁḍide
dikkula nādani voja diddave nīvu

(||sūda||)
ittala śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nī kabbide
sittamu garam̐ga sanna seyave nīvu
hatti sesavĕṭṭi pĕṁḍāḍinām̐ ḍīm̐taḍu nem̐ḍu
kŏtta lela yim̐ka niyyagŏnave nīvu