చూతము మనమూరకె చుట్టపు వరుసలను
(॥పల్లవి॥)
చూతము మనమూరకె చుట్టపు వరుసలను
కాతరించి తముఁ దామె కలసేరుగాక
(॥చూత॥)
కామించి వచ్చినకాంత కాఁతాళించి రమణుని
యేమేమి సేసినాను యెగ్గులయ్యీనా
ఆముక ఇందుకు మన మడ్డాలు చెప్పఁగనేల
తాముఁదామే తెలిసి సంతములయ్యేరుగాక
(॥చూత॥)
గాఁటమైన విరహిణి కాఁకల కోరువలేక
మాఁటలెన్ని యాడినాను మానీనా పొందు
యీటైన సవతులము ఇట్టె బుద్ది చెప్పనేల
పాటించి మొగమోటానఁ బైకొనేరుగాక
(॥చూత॥)
వాడికైన యాసతోడ వరుసకు వచ్చినది
వేడకకెంత నవ్వనానే(ను?) వేసటయ్యీనా
యీడనె శ్రీవేంకటేశుఁ డేలె మనల నిందరి
జోడుగూడి యీపెఁ దానూఁ జొక్కేరు గాక
(||pallavi||)
sūdamu manamūragĕ suṭṭabu varusalanu
kādariṁchi tamum̐ dāmĕ kalaserugāga
(||sūda||)
kāmiṁchi vachchinagāṁta kām̐tāḽiṁchi ramaṇuni
yememi sesinānu yĕggulayyīnā
āmuga iṁdugu mana maḍḍālu sĕppam̐ganela
tāmum̐dāme tĕlisi saṁtamulayyerugāga
(||sūda||)
gām̐ṭamaina virahiṇi kām̐kala koruvalega
mām̐ṭalĕnni yāḍinānu mānīnā pŏṁdu
yīḍaina savadulamu iṭṭĕ buddi sĕppanela
pāḍiṁchi mŏgamoḍānam̐ baigŏnerugāga
(||sūda||)
vāḍigaina yāsadoḍa varusagu vachchinadi
veḍagagĕṁta navvanāne(nu?) vesaḍayyīnā
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ manala niṁdari
joḍugūḍi yībĕm̐ dānūm̐ jŏkkeru gāga