చూతము దానికేమి సుభము లన్నియు నింకా
(॥పల్లవి॥)
చూతము దానికేమి సుభము లన్నియు నింకా
కాతరపుచేఁతలచే కడుమించరాదా
(॥చూత॥)
తెల్లనాయఁ గన్నులు తేటలాయ నీసుద్దులు
పల్లదాన మావొడేల పట్టేవయ్య
చెల్లుబడి గలదు సిగ్గులు నీకా లేవు
బల్లిదుఁడవై యిట్లానే బతుకరాదా
(॥చూత॥)
చెమరించె నీమేను చేఁతలు రూడికెక్కె
తమితో నింకా మమ్మేల దగ్గరేవయ్యా
భ్రమయించనేరుతువు బాసలు మీఱఁగలవు
అమర నిన్నిమేళ్లు నందఁగరాదా
(॥చూత॥)
కళలు మోమున రేఁగె కాఁగిటిలో చలివాసె
బలిమిసేసి మమ్మేల పై కొనెవయ్య
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
వెలలేని వేడుకల వెలయరాదా
(||pallavi||)
sūdamu dānigemi subhamu lanniyu niṁkā
kādarabusem̐talase kaḍumiṁcharādā
(||sūda||)
tĕllanāyam̐ gannulu teḍalāya nīsuddulu
palladāna māvŏḍela paṭṭevayya
sĕllubaḍi galadu siggulu nīgā levu
ballidum̐ḍavai yiṭlāne badugarādā
(||sūda||)
sĕmariṁchĕ nīmenu sem̐talu rūḍigĕkkĕ
tamido niṁkā mammela daggarevayyā
bhramayiṁchaneruduvu bāsalu mīṟam̐galavu
amara ninnimeḽlu naṁdam̐garādā
(||sūda||)
kaḽalu momuna rem̐gĕ kām̐giḍilo salivāsĕ
balimisesi mammela pai kŏnĕvayya
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
vĕlaleni veḍugala vĕlayarādā