Soodamgadavayyaa yeebe joodumdanaalu

చూడఁగదవయ్యా యీపె జూటుఁదనాలు
Language

(॥పల్లవి॥)
చూడఁగదవయ్యా యీపె జూటుఁదనాలు
వేడుకతో దైవారీ వేసా లీడ నెంతో

(॥చూడఁ॥)
బిగువుఁ జన్నుల నొత్తి పెనఁగులాడీ నీతో
మగువ దంటతనము మరి యంతో
నగుతానే కొనగోరు నయమున సోఁకించీ
తగులైన నీపై తమి తనకెంతో

(॥చూడఁ॥)
కరములు చాఁచి కడు నిన్నుఁ జెనకీని
యిరవైన గర్వ మీపె కింక నెంతో
తురుములోని విరిదండ తోడనే నీ మెడవేసీ
సొరిది నీతోఁ జేసిన చుట్టరిక మెంతో

(॥చూడఁ॥)
సారె సారె నీ మోవిచవులు నిన్నడిగీని
మేరమీరి యీకె మందెమేళ మెంతో
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కోరి నీవద్దఁ గూచుండీ కోమలియాస యెంతో

(||pallavi||)
sūḍam̐gadavayyā yībĕ jūḍum̐danālu
veḍugado daivārī vesā līḍa nĕṁto

(||sūḍam̐||)
biguvum̐ jannula nŏtti pĕnam̐gulāḍī nīdo
maguva daṁṭadanamu mari yaṁto
nagudāne kŏnagoru nayamuna som̐kiṁchī
tagulaina nībai tami tanagĕṁto

(||sūḍam̐||)
karamulu sām̐si kaḍu ninnum̐ jĕnagīni
yiravaina garva mībĕ kiṁka nĕṁto
turumuloni viridaṁḍa toḍane nī mĕḍavesī
sŏridi nīdom̐ jesina suṭṭariga mĕṁto

(||sūḍam̐||)
sārĕ sārĕ nī movisavulu ninnaḍigīni
meramīri yīgĕ maṁdĕmeḽa mĕṁto
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
kori nīvaddam̐ gūsuṁḍī komaliyāsa yĕṁto