చూడఁగదరే యీతని సుద్దులు వో చెలులాల
(॥పల్లవి॥)
చూడఁగదరే యీతని సుద్దులు వో చెలులాల
వాడలోన నివీఁ గొన్ని వట్టివేసాలు
(॥చూడఁ॥)
వెంగెము లాడితినా వెస దనదిక్కు చూచి
చెంగి చెంగి తా నేల సిగ్గువడీనే
అంగడిఁ బెట్టితినా ఆరడిఁ దన చేఁతలు
యెంగిలి మోవి మూసుక యేల నవ్వీనే
(॥చూడఁ॥)
తప్పక చూచితినా తన మేని గురుతులు
అప్పుడే పచ్చడ మెంత కప్పుకొనీనే
తప్పులువట్టితినా తా నాడినమాటఁలు
చొప్పులుగాఁ దా నిదేమి వొట్టువెట్టొకనీనే
(॥చూడ॥)
గోరికొన నూఁదితినా కొడిమలెల్లా గట్టి
చేరి వేఁడుకొని యాల చెక్కు నొక్కనే
యీరీతి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
తారుకాణించి నా కెన్ని తగవులు చెప్పీనే
(||pallavi||)
sūḍam̐gadare yīdani suddulu vo sĕlulāla
vāḍalona nivīm̐ gŏnni vaṭṭivesālu
(||sūḍam̐||)
vĕṁgĕmu lāḍidinā vĕsa danadikku sūsi
sĕṁgi sĕṁgi tā nela sigguvaḍīne
aṁgaḍim̐ bĕṭṭidinā āraḍim̐ dana sem̐talu
yĕṁgili movi mūsuga yela navvīne
(||sūḍam̐||)
tappaga sūsidinā tana meni gurudulu
appuḍe pachchaḍa mĕṁta kappugŏnīne
tappuluvaṭṭidinā tā nāḍinamāḍam̐lu
sŏppulugām̐ dā nidemi vŏṭṭuvĕṭṭŏganīne
(||sūḍa||)
gorigŏna nūm̐didinā kŏḍimalĕllā gaṭṭi
seri vem̐ḍugŏni yāla sĕkku nŏkkane
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
tārugāṇiṁchi nā kĕnni tagavulu sĕppīne