చూతమే యీ సంతోసాలు సొరిదినుండి
(॥పల్లవి॥)
చూతమే యీ సంతోసాలు సొరిదినుండి
ఐతే నేమే సవతుల మది మనమేలే
(॥॥)
సతి తిట్టు లతనికి చవులై వుండఁగాను
మతిలోన వగవఁగ మనకేల
యితవై యీపెగుంపెన కితఁడు లోఁగుచుండఁగా
కుతిలకుడువ నేలే కొమ్మలాల మనము
(॥॥)
ఆపె సేసే వుద్దండాలు ఆతఁడోరుచుకుండఁగా
కోపమేలే మనకును కోపులనుండి
వోపి యాలియాజ్ఞ మగఁడొట్టి జవదాటఁడు
ఆపసోపాలేలే మన మందరిలో వారము
(॥॥)
కొంగాపె వట్టి తియ్యఁగాఁ గూచుండాతఁడు లోఁగాఁగా
పంగించనేలే మనము పలుమారును
యెంగిలి మోవిచ్చె నాపె యెనసి శ్రీవేంకటేశుఁ
డంగదేలే యేలిరిద్దరట్టే మనములను
(||pallavi||)
sūdame yī saṁtosālu sŏridinuṁḍi
aide neme savadula madi manamele
(||||)
sadi tiṭṭu ladanigi savulai vuṁḍam̐gānu
madilona vagavam̐ga managela
yidavai yībĕguṁpĕna kidam̐ḍu lom̐gusuṁḍam̐gā
kudilaguḍuva nele kŏmmalāla manamu
(||||)
ābĕ sese vuddaṁḍālu ādam̐ḍorusuguṁḍam̐gā
kobamele managunu kobulanuṁḍi
vobi yāliyājña magam̐ḍŏṭṭi javadāḍam̐ḍu
ābasobālele mana maṁdarilo vāramu
(||||)
kŏṁgābĕ vaṭṭi tiyyam̐gām̐ gūsuṁḍādam̐ḍu lom̐gām̐gā
paṁgiṁchanele manamu palumārunu
yĕṁgili movichchĕ nābĕ yĕnasi śhrīveṁkaḍeśhum̐
ḍaṁgadele yeliriddaraṭṭe manamulanu