చూతమయ్యా యింకా నీపె సుద్దులెల్లాను
(॥పల్లవి॥)
చూతమయ్యా యింకా నీపె సుద్దులెల్లాను
కాతరపు టీకె యెంత కలికియో కాని
(॥చూత॥)
నిమ్ముఁజూపులను జూచి సిగ్గులెల్లఁ బెడరేఁచి
నిమ్మపండు గానుకిచ్చీ నెలఁత నీకు
ఉమ్మగిలఁ జెయివట్టి వుబ్బుమాఁట లాడించి
నెమ్మది నింకా నెంతేసి నేరుచునో కాని
(॥చూత॥)
యెలుఁగించి సన్న సేసి యెదుటనే నిలుచుండి
యెలయింపునవ్వు చల్లీ నింతి నీమీఁద
లలి సురటి విసరి కళలు మోమున రేఁచి
నిలువున మోహ మెంతనెరపీనో కాని
(॥చూత॥)
పోసరించి సింగారించి పూవులు నీకు ముడిచి
ఆసలే కడుఁజూపీ నతివ నీకు
సేసవెట్టి కూడితివి శ్రీవేంకటేశ నన్ను
నీసరి నున్నది తాను నీటెంతో కాని
(||pallavi||)
sūdamayyā yiṁkā nībĕ suddulĕllānu
kādarabu ṭīgĕ yĕṁta kaligiyo kāni
(||sūda||)
nimmum̐jūbulanu jūsi siggulĕllam̐ bĕḍarem̐si
nimmabaṁḍu gānugichchī nĕlam̐ta nīgu
ummagilam̐ jĕyivaṭṭi vubbumām̐ṭa lāḍiṁchi
nĕmmadi niṁkā nĕṁtesi nerusuno kāni
(||sūda||)
yĕlum̐giṁchi sanna sesi yĕduḍane nilusuṁḍi
yĕlayiṁpunavvu sallī niṁti nīmīm̐da
lali suraḍi visari kaḽalu momuna rem̐si
niluvuna moha mĕṁtanĕrabīno kāni
(||sūda||)
posariṁchi siṁgāriṁchi pūvulu nīgu muḍisi
āsale kaḍum̐jūbī nadiva nīgu
sesavĕṭṭi kūḍidivi śhrīveṁkaḍeśha nannu
nīsari nunnadi tānu nīḍĕṁto kāni