చూడఁ చిన్నవాఁడు గాని సుగుణ(ణి?) వీఁడు
(॥పల్లవి॥)
చూడఁ చిన్నవాఁడు గాని సుగుణ(ణి?) వీఁడు
యేడఁ జూచినాఁ దానే యేమి చెప్పేదమ్మా
(॥చడ॥)
సంగతిగా గొల్లెతల చన్నులంటి చూచుకొంటా
దొంగిలీని పోరచిపొందుల కృష్ణుఁడు
ముంగిటి కన్నెల మోవి ముద్దులు వెట్టుకొంటాను
యెంగిలికి రోయఁడు యేమి చెప్పేదమ్మా
(॥చడ॥)
అప్పలప్పలనే వారి నట్టే కాఁగిలించుకొంటా
తప్పుటడుగులు వెట్టీఁదానే కృష్ణుఁడు
చిప్పల మాటలాడి సిగ్గులు వరచుకొంటా
యిప్పుడే యింత సేసీని యేమి చెప్పేదమ్మా
(॥చడ॥)
లలిఁ బోంకముడి వట్టి లాసుకొంటా నందరిని
గిలిగించీ శ్రీవేంకటగిరి కృష్ణుఁడు
తొలుత నుద్దగిరిఁ గందువ విజయనగరాన
యెలమి రతులు చూపీ నేమి చెప్పేదమ్మా
(||pallavi||)
sūḍam̐ sinnavām̐ḍu gāni suguṇa(ṇi?) vīm̐ḍu
yeḍam̐ jūsinām̐ dāne yemi sĕppedammā
(||saḍa||)
saṁgadigā gŏllĕdala sannulaṁṭi sūsugŏṁṭā
dŏṁgilīni porasibŏṁdula kṛṣhṇum̐ḍu
muṁgiḍi kannĕla movi muddulu vĕṭṭugŏṁṭānu
yĕṁgiligi royam̐ḍu yemi sĕppedammā
(||saḍa||)
appalappalane vāri naṭṭe kām̐giliṁchugŏṁṭā
tappuḍaḍugulu vĕṭṭīm̐dāne kṛṣhṇum̐ḍu
sippala māḍalāḍi siggulu varasugŏṁṭā
yippuḍe yiṁta sesīni yemi sĕppedammā
(||saḍa||)
lalim̐ boṁkamuḍi vaṭṭi lāsugŏṁṭā naṁdarini
giligiṁchī śhrīveṁkaḍagiri kṛṣhṇum̐ḍu
tŏluda nuddagirim̐ gaṁduva vijayanagarāna
yĕlami radulu sūbī nemi sĕppedammā