Soodam jooda vedugayyee sudadi nee baagulu

చూడఁ జూడ వేడుకయ్యీ సుదతి నీ బాగులు
Language

(॥పల్లవి॥)
చూడఁ జూడ వేడుకయ్యీ సుదతి నీ బాగులు
వాడలోన నీ సుద్దులు వన్నెకెక్కెఁ జెప్పవే

(॥చూడ॥)
కొలఁది మీరిన నీ కోరకె నీడేరెనటే
కళలుదేరీ మోమునఁ గలికి నీకు
బలిమి నీవాడిన పంతములు చెల్లెనటె
సలవుల నవ్వులు చిందీ నేఁడిపుడు

(॥చూడ॥)
మున్నునీవు నోఁచిన నోములు ఫలియించెనటె
వున్నతి సంతోసాన నోలలాడేవు
తన్నుఁదానె నీ యెన్నిక తారుకాణ వచ్చెనటె
పున్నమచెద్రుని వలెఁ బొదలీ నీ మోము

(॥చూడ॥)
మగువలలోన నీ మనసొక్కటాయనటె
మీగులా సొంపుల నీవు నెరసేవు
జిగి నిన్నుఁ గూడెనటె శ్రీ వేంకటేశుఁడు
నిగిడి రతిచిహ్నలు నిలువెల్లా నిండెను

(||pallavi||)
sūḍam̐ jūḍa veḍugayyī sudadi nī bāgulu
vāḍalona nī suddulu vannĕgĕkkĕm̐ jĕppave

(||sūḍa||)
kŏlam̐di mīrina nī koragĕ nīḍerĕnaḍe
kaḽaluderī momunam̐ galigi nīgu
balimi nīvāḍina paṁtamulu sĕllĕnaḍĕ
salavula navvulu siṁdī nem̐ḍibuḍu

(||sūḍa||)
munnunīvu nom̐sina nomulu phaliyiṁchĕnaḍĕ
vunnadi saṁtosāna nolalāḍevu
tannum̐dānĕ nī yĕnniga tārugāṇa vachchĕnaḍĕ
punnamasĕdruni valĕm̐ bŏdalī nī momu

(||sūḍa||)
maguvalalona nī manasŏkkaḍāyanaḍĕ
mīgulā sŏṁpula nīvu nĕrasevu
jigi ninnum̐ gūḍĕnaḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu
nigiḍi radisihnalu niluvĕllā niṁḍĕnu