చూడఁ జూడ నింతలోనే సుక్కరారమునాఁడు
(॥పల్లవి॥)
చూడఁ జూడ నింతలోనే సుక్కరారమునాఁడు
ఆడ నీడ విభవాలే అమరె దేవునికి
(॥చూడ॥)
మేటిపాలజలధిలో మీఁగడ లంటెనో కాని
వీటనే దొంగిలినట్టి వెన్న లంటెనో
నూటుక యాకాశగంగమరు గంటెనో యనఁగ
ఆటలఁ గర్పూరకాపు అమరె దేవునికి
(॥చూడ॥)
శిసువులఁ దెచ్చునాఁడు చీఁకటి యంటెనో కాని
మసలక కరిఁ గాచేనుద మంటెనో
సుసరాన నీలి కాసెసొగ టంటెనో యనఁగ
అదై పుణుఁగుకాపు అమరె దేవునికి
(॥చూడ॥)
పరమతేజంభైన ప్రభలు చల్లెనో కాని
వురము శ్రీసతియున్న వొరపు లివి
అరిది శ్రీవేంకటేశు కలమెలుమంగతోడ
అరలేక సొమ్ము లెల్ల నమరె దేవునికి
(||pallavi||)
sūḍam̐ jūḍa niṁtalone sukkarāramunām̐ḍu
āḍa nīḍa vibhavāle amarĕ devunigi
(||sūḍa||)
meḍibālajaladhilo mīm̐gaḍa laṁṭĕno kāni
vīḍane dŏṁgilinaṭṭi vĕnna laṁṭĕno
nūḍuga yāgāśhagaṁgamaru gaṁṭĕno yanam̐ga
āḍalam̐ garbūragābu amarĕ devunigi
(||sūḍa||)
śhisuvulam̐ dĕchchunām̐ḍu sīm̐kaḍi yaṁṭĕno kāni
masalaga karim̐ gāsenuda maṁṭĕno
susarāna nīli kāsĕsŏga ṭaṁṭĕno yanam̐ga
adai puṇum̐gugābu amarĕ devunigi
(||sūḍa||)
paramadejaṁbhaina prabhalu sallĕno kāni
vuramu śhrīsadiyunna vŏrabu livi
aridi śhrīveṁkaḍeśhu kalamĕlumaṁgadoḍa
aralega sŏmmu lĕlla namarĕ devunigi