చూడఁ జిన్నదాన వింతె సుద్దులు కోటానఁగోటి
(॥పల్లవి॥)
చూడఁ జిన్నదాన వింతె సుద్దులు కోటానఁగోటి
యేడేడ నేరుచుకొంటివే వో కలికి
(॥చూడఁ॥)
కిన్నెరమీఁటులలోని గిలిగింతలు । నీ -
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నఁడు నేరుచుకొంటివే నో కలికి
(॥చూడఁ॥)
సారెకు నెడవాయని సరసములు । నీ -
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి
(॥చూడఁ॥)
కందువ శ్రీవేంకటేశు కలయికలు । నీ -
యందమైన సమరతి యలయికలు
పొందుల మునిముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి
(||pallavi||)
sūḍam̐ jinnadāna viṁtĕ suddulu koḍānam̐goḍi
yeḍeḍa nerusugŏṁṭive vo kaligi
(||sūḍam̐||)
kinnĕramīm̐ṭulaloni giligiṁtalu | nī -
vannĕla kanusūbula valavaṁtalu
yĕnnarāni yichchagabu ṭĕlayiṁtalu
yĕnnam̐ḍu nerusugŏṁṭive no kaligi
(||sūḍam̐||)
sārĕgu nĕḍavāyani sarasamulu | nī -
tārugāṇa sannala tamagamulu
gāraviṁchi bujjagiṁche gamagamulu
yerīdi nerusugŏṁṭive vo kaligi
(||sūḍam̐||)
kaṁduva śhrīveṁkaḍeśhu kalayigalu | nī -
yaṁdamaina samaradi yalayigalu
pŏṁdula munimuṁgili pŏlayigalu
yĕṁdĕṁdu nerusugŏṁṭive vo kaligi