చూడఁ గొత్తలై వున్నవి సొరిది నీ గుణములు
(॥పల్లవి॥)
చూడఁ గొత్తలై వున్నవి సొరిది నీ గుణములు
యీడుజోడై నాకుఁ జన విప్పుడే యిచ్చేవు
(॥చడ॥)
ఆపె నిన్నుఁ దమి రేఁచి యంపెనో ని న్నీడకు
యీపొద్దు విచ్చేసితివి యిన్నాళ్లకు
తీపులు నీమోవిఁ బూసి తిట్టెనో ని న్నింతేసి
పైపైఁ దేనెలు గార బలికేవు నేఁడు
(॥చడ॥)
బోదించి యెట్లా నాపె బుద్దులు నూరిపోసెనో
సాదువలె నేమని నా సమ్మతించేవు
కా దనక రతి నుబ్బుఁగవణము మేపెనో
నాదెస చూచి నీవు నవ్వులు నవ్వేవు
(॥చడ॥)
చుట్టిరిక మెల్లా నీకు సూటిగాఁ దెలిపెనో
గట్టిగా నిట్టే నన్నుఁ గౌఁగిలించేవు
దిట్ట శ్రీవేంకటేశ్వర దిద్దెనో రతు లాపె
జట్టిగా నన్నందులోనే సాము సేయించేవు
(||pallavi||)
sūḍam̐ gŏttalai vunnavi sŏridi nī guṇamulu
yīḍujoḍai nāgum̐ jana vippuḍe yichchevu
(||saḍa||)
ābĕ ninnum̐ dami rem̐si yaṁpĕno ni nnīḍagu
yībŏddu vichchesidivi yinnāḽlagu
tībulu nīmovim̐ būsi tiṭṭĕno ni nniṁtesi
paibaim̐ denĕlu gāra baligevu nem̐ḍu
(||saḍa||)
bodiṁchi yĕṭlā nābĕ buddulu nūribosĕno
sāduvalĕ nemani nā sammadiṁchevu
kā danaga radi nubbum̐gavaṇamu mebĕno
nādĕsa sūsi nīvu navvulu navvevu
(||saḍa||)
suṭṭiriga mĕllā nīgu sūḍigām̐ dĕlibĕno
gaṭṭigā niṭṭe nannum̐ gaum̐giliṁchevu
diṭṭa śhrīveṁkaḍeśhvara diddĕno radu lābĕ
jaṭṭigā nannaṁdulone sāmu seyiṁchevu