Soodam gottalaaya mee suddulu nemdu

చూడఁ గొత్తలాయ మీ సుద్దులు నేఁడు
Language

(॥పల్లవి॥)
చూడఁ గొత్తలాయ మీ సుద్దులు నేఁడు
వాడవారెల్లా మెచ్చి వేడుకపడేరు

(॥॥)
పచ్చడము మరఁగునఁ బడఁతిఁ బెట్టుకొని
యిచ్చల వేరొక యింతి నెలయించేవు
చెచ్చెర నాపె నిన్నుఁ జెనకఁగఁ జూచితేను
పచ్చిగా నిన్నిట్టే యాపె పయ్యదఁ గప్పీని

(॥॥)
కుడి దిక్కునను వొక్కకోమలిపైఁ జేయివేసి
యెడమనొక్క సతితో నిటు నవ్వేవు
జడిగొని నిన్నునాపె సన్నలు సేసితేను
కొడిసాగ నీపె ఇట్టే గోర నొత్తీని

(॥॥)
అలమేలుమంగ నురమందు నీవు నెట్టుకొని
మలసి వీఁపున భూరమణిఁ బెట్టితి
కలసె శ్రీవేంకటేశ గక్కనఁ గాఁగిట నాపె
చలివాయఁ గూడి యాపె చన్నుల నొత్తీని

(||pallavi||)
sūḍam̐ gŏttalāya mī suddulu nem̐ḍu
vāḍavārĕllā mĕchchi veḍugabaḍeru

(||||)
pachchaḍamu maram̐gunam̐ baḍam̐tim̐ bĕṭṭugŏni
yichchala verŏga yiṁti nĕlayiṁchevu
sĕchchĕra nābĕ ninnum̐ jĕnagam̐gam̐ jūsidenu
pachchigā ninniṭṭe yābĕ payyadam̐ gappīni

(||||)
kuḍi dikkunanu vŏkkagomalibaim̐ jeyivesi
yĕḍamanŏkka sadido niḍu navvevu
jaḍigŏni ninnunābĕ sannalu sesidenu
kŏḍisāga nībĕ iṭṭe gora nŏttīni

(||||)
alamelumaṁga nuramaṁdu nīvu nĕṭṭugŏni
malasi vīm̐puna bhūramaṇim̐ bĕṭṭidi
kalasĕ śhrīveṁkaḍeśha gakkanam̐ gām̐giḍa nābĕ
salivāyam̐ gūḍi yābĕ sannula nŏttīni