చూడఁ బిన్నవుగాని నీ జూటుఁజేఁత లెంచరావు
(॥పల్లవి॥)
చూడఁ బిన్నవుగాని నీ జూటుఁజేఁత లెంచరావు
యీడు మిగిలినట్టి పగటు లెందు నేర్చుకొంటివే
(॥చూడఁ॥)
చొక్కపుమోవిఁ దేనెలొలక సుద్దులు చెప్పుచునాయకునకును
చక్కనిమోము చూపి యతని చనవు చేకొంటివే
జక్కవచన్నులు దాఁకఁగదీసి చల్లుఁజూపుల మనసు గరఁచి
యెక్కడలేని కలికితనము లెందు నేర్చుకొంటివే
(॥చూడఁ॥)
నవ్వులు చెక్కుల నారుకొనఁగ నయముఁ బ్రియముదైలువార
పువ్వుల వేసి యతని నెట్టు పొందుసేసుకొంటివే
దువ్వటంపు చెఱఁగు మొరయ తోడు దోడ సురటి విసరి
ఇవ్వల నతని మరపుకొనఁగ నెందు నేర్చుకొంటివే
(॥చూడఁ॥)
సిగ్గుల చేఁతలు బయలు పడఁగ సేవలు సేసిచవులురేఁచి
వెగ్గళమైనయతని మన్నన వెలయఁ జేసుకొంటివే
నిగ్గుల శ్రీ వేంకటేశుఁడు నేఁడు నన్నుఁ గాఁగిటఁగూడె
యెగ్గులులేని రతులు నీవు నెందు నేర్చుకొంటివే
(||pallavi||)
sūḍam̐ binnavugāni nī jūḍum̐jem̐ta lĕṁcharāvu
yīḍu migilinaṭṭi pagaḍu lĕṁdu nersugŏṁṭive
(||sūḍam̐||)
sŏkkabumovim̐ denĕlŏlaga suddulu sĕppusunāyagunagunu
sakkanimomu sūbi yadani sanavu segŏṁṭive
jakkavasannulu dām̐kam̐gadīsi sallum̐jūbula manasu garam̐si
yĕkkaḍaleni kaligidanamu lĕṁdu nersugŏṁṭive
(||sūḍam̐||)
navvulu sĕkkula nārugŏnam̐ga nayamum̐ briyamudailuvāra
puvvula vesi yadani nĕṭṭu pŏṁdusesugŏṁṭive
duvvaḍaṁpu sĕṟam̐gu mŏraya toḍu doḍa suraḍi visari
ivvala nadani marabugŏnam̐ga nĕṁdu nersugŏṁṭive
(||sūḍam̐||)
siggula sem̐talu bayalu paḍam̐ga sevalu sesisavulurem̐si
vĕggaḽamainayadani mannana vĕlayam̐ jesugŏṁṭive
niggula śhrī veṁkaḍeśhum̐ḍu nem̐ḍu nannum̐ gām̐giḍam̐gūḍĕ
yĕggululeni radulu nīvu nĕṁdu nersugŏṁṭive