Soodam binnavu gaani neesuddu lennainaam galavu

చూడఁ బిన్నవు గాని నీసుద్దు లెన్నైనాఁ గలవు
Language

(॥పల్లవి॥)
చూడఁ బిన్నవు గాని నీసుద్దు లెన్నైనాఁ గలవు
వేడుకకత్తెకుఁ గాని వేసాలింత రావే

(॥॥)
తేలగిల రమణుని దిష్టించి సారెఁ జూచేవు
చేలకొంగాతఁ డంటితే సిగ్గువడేవు
నాలితనాన సెలవి నవ్వూఁ గొంత నవ్వేవు
యీలీల తరితీపులు యెన్ని నేర్చుకొంటివే

(॥॥)
మునుకొని మగవాని ముందరనూఁ బొలసేవు
పెనఁగి పైకొంటేఁ దప్పించుకొనేవు
మనసిచ్చి యంతలోనె మంచిమాఁట లాడేవు
యెనలేనియడియాస లెన్ని నేర్చుకొంటివే

(॥॥)
సేవ సేసే దానివలె చేరి వద్దనే వుండవు
శ్రీ వేంకటేశుఁ డేలితే జీరదీసేవు
భావించాడతఁడు నన్నేలె పాదాలకు మొక్కేవు
యీవిధాన నిట్టిబూమె లేమి నేర్చుకొంటివే

(||pallavi||)
sūḍam̐ binnavu gāni nīsuddu lĕnnainām̐ galavu
veḍugagattĕgum̐ gāni vesāliṁta rāve

(||||)
telagila ramaṇuni diṣhṭiṁchi sārĕm̐ jūsevu
selagŏṁgādam̐ ḍaṁṭide sigguvaḍevu
nālidanāna sĕlavi navvūm̐ gŏṁta navvevu
yīlīla taridībulu yĕnni nersugŏṁṭive

(||||)
munugŏni magavāni muṁdaranūm̐ bŏlasevu
pĕnam̐gi paigŏṁṭem̐ dappiṁchugŏnevu
manasichchi yaṁtalonĕ maṁchimām̐ṭa lāḍevu
yĕnaleniyaḍiyāsa lĕnni nersugŏṁṭive

(||||)
seva sese dānivalĕ seri vaddane vuṁḍavu
śhrī veṁkaḍeśhum̐ ḍelide jīradīsevu
bhāviṁchāḍadam̐ḍu nannelĕ pādālagu mŏkkevu
yīvidhāna niṭṭibūmĕ lemi nersugŏṁṭive