చూడఁ బిన్నవాఁడుగాని సుద్దులైతే వేవేలు
(॥పల్లవి॥)
చూడఁ బిన్నవాఁడుగాని సుద్దులైతే వేవేలు
వోడక వింతలుసేసీ వుద్దగిరి కృష్ణుఁడు
(॥చూడఁ॥)
సెలవినవ్వులతోడ చెలులమోములు చూచి
పలీ ముద్దుమాటల బాలకృష్ణుడు
చలపాదాగొల్లెతల చనుఁగొండలతోడుత
తులఁదూచీఁ వలపులు దొంగాడుఁ గృష్ణుఁడు
(॥చూడఁ॥)
తప్పుటడుగులతోడ తరుణలకెల్లాను
చిప్పిల ముద్దులువెట్టీ చెన్నకృష్ణుఁడు
ముప్పిరియాసలఁ బొంది ముదితలవొడిలోన
వొప్పుగా జేతులు చూఁచీ నుద్దగిరికృష్ణుఁడు
(॥చూడఁ॥)
గట్టి వెన్నుముద్దతోడ కాంతాలను మరిగించి
పట్టపగలే కూడీ గోపాలకృష్ణుడు
ఇట్టె విజనగరాల యెమ్మెలెల్లాఁ జూపీని
చిట్టకపుఁ జేఁతల శ్రీవేంకటకృష్ణుడు
(||pallavi||)
sūḍam̐ binnavām̐ḍugāni suddulaide vevelu
voḍaga viṁtalusesī vuddagiri kṛṣhṇum̐ḍu
(||sūḍam̐||)
sĕlavinavvuladoḍa sĕlulamomulu sūsi
palī muddumāḍala bālakṛṣhṇuḍu
salabādāgŏllĕdala sanum̐gŏṁḍaladoḍuda
tulam̐dūsīm̐ valabulu dŏṁgāḍum̐ gṛṣhṇum̐ḍu
(||sūḍam̐||)
tappuḍaḍuguladoḍa taruṇalagĕllānu
sippila mudduluvĕṭṭī sĕnnakṛṣhṇum̐ḍu
muppiriyāsalam̐ bŏṁdi mudidalavŏḍilona
vŏppugā jedulu sūm̐sī nuddagirikṛṣhṇum̐ḍu
(||sūḍam̐||)
gaṭṭi vĕnnumuddadoḍa kāṁtālanu marigiṁchi
paṭṭabagale kūḍī gobālakṛṣhṇuḍu
iṭṭĕ vijanagarāla yĕmmĕlĕllām̐ jūbīni
siṭṭagabum̐ jem̐tala śhrīveṁkaḍakṛṣhṇuḍu