Soodam binnavaamdu gaani suddulennainaam galavu

చూడఁ బిన్నవాఁడు గాని సుద్దులెన్నైనాఁ గలవు
Language

(॥పల్లవి॥)
చూడఁ బిన్నవాఁడు గాని సుద్దులెన్నైనాఁ గలవు
వీడుదోడైన దేవళ్ల విట్ఠలేశుఁ డితఁడు

(॥చూడఁ॥)
పిల్లఁగోవి రాగాలు బెరియించి గొల్లెతల -
వుల్లములు గరఁగించీ నుబ్బులు రేఁచి
పల్లదాన వెన్నెల బయట యమునలోన
వెల్లవిరిఁ గూడిన యావిట్ఠలేశుఁ డితఁడు

(॥చూడఁ॥)
కొలనిలో నీళ్లాడే కొమ్మలను వలపించి
చెలఁగి మానాలు చూచి చీరలిచ్చి
కొలఁదిమీర వారి కోరిక లేడేరఁజేసి
వెలసి యుండిన యా విట్ఠలేశుఁ డితఁడు

(॥చూడఁ॥)
వోడక మధురలో నువిదచే గందమంది
యీడులేని తన మహిమెల్లాఁ జూపి
జాడతో శ్రీవేంకటాద్రి శైలముపై నిలుచుండి
వేడుకకాఁడైన యావిట్ఠలేశుఁ డితఁడు

(||pallavi||)
sūḍam̐ binnavām̐ḍu gāni suddulĕnnainām̐ galavu
vīḍudoḍaina devaḽla viṭṭhaleśhum̐ ḍidam̐ḍu

(||sūḍam̐||)
pillam̐govi rāgālu bĕriyiṁchi gŏllĕdala -
vullamulu garam̐giṁchī nubbulu rem̐si
palladāna vĕnnĕla bayaḍa yamunalona
vĕllavirim̐ gūḍina yāviṭṭhaleśhum̐ ḍidam̐ḍu

(||sūḍam̐||)
kŏlanilo nīḽlāḍe kŏmmalanu valabiṁchi
sĕlam̐gi mānālu sūsi sīralichchi
kŏlam̐dimīra vāri koriga leḍeram̐jesi
vĕlasi yuṁḍina yā viṭṭhaleśhum̐ ḍidam̐ḍu

(||sūḍam̐||)
voḍaga madhuralo nuvidase gaṁdamaṁdi
yīḍuleni tana mahimĕllām̐ jūbi
jāḍado śhrīveṁkaḍādri śhailamubai nilusuṁḍi
veḍugagām̐ḍaina yāviṭṭhaleśhum̐ ḍidam̐ḍu