Soodam binnagaani suddulu peddalu

చూడఁ బిన్నగాని సుద్దులు పెద్దలు
Language

(॥పల్లవి॥)
చూడఁ బిన్నగాని సుద్దులు పెద్దలు
కూడి పట్టఁబట్టఁ గొట్టీ గోవిందుఁడు

(॥చూడ॥)
పాలవుట్టిఁ గొట్టి పరువునఁ బోయి
వేలాడఁగాఁ గొట్టె వెన్నవుట్టి
కేలు చాఁచి కొట్టె కిందితేనెవుట్టి
యేలాగు దాఁతమే యేమందమే

(॥చూడ॥)
చక్కిలాలవుట్టి సరుగనఁ గొట్టి
నిక్కి నిక్కి కొట్టె నేతివుట్టి
పక్క దిక్కు గొట్టె పంచదారవుట్టి
యెక్కడ దాఁతమే యేమందమే

(॥చూడ॥)
వారవట్టి కొట్టె వంచి పెరుగువుట్టి
చారపప్పువుట్టి జారఁగొట్టె
కోరి శ్రీవేంకటగోవిందకృష్ణుని-
కేరీతి దాఁతమే యేమందమే

(||pallavi||)
sūḍam̐ binnagāni suddulu pĕddalu
kūḍi paṭṭam̐baṭṭam̐ gŏṭṭī goviṁdum̐ḍu

(||sūḍa||)
pālavuṭṭim̐ gŏṭṭi paruvunam̐ boyi
velāḍam̐gām̐ gŏṭṭĕ vĕnnavuṭṭi
kelu sām̐si kŏṭṭĕ kiṁdidenĕvuṭṭi
yelāgu dām̐tame yemaṁdame

(||sūḍa||)
sakkilālavuṭṭi saruganam̐ gŏṭṭi
nikki nikki kŏṭṭĕ nedivuṭṭi
pakka dikku gŏṭṭĕ paṁchadāravuṭṭi
yĕkkaḍa dām̐tame yemaṁdame

(||sūḍa||)
vāravaṭṭi kŏṭṭĕ vaṁchi pĕruguvuṭṭi
sārabappuvuṭṭi jāram̐gŏṭṭĕ
kori śhrīveṁkaḍagoviṁdakṛṣhṇuni-
kerīdi dām̐tame yemaṁdame