చూడఁ బిన్నపు సేఁతలు చూపి చెప్పఁగఁ గొత్తలు
(॥పల్లవి॥)
చూడఁ బిన్నపు సేఁతలు చూపి చెప్పఁగఁ గొత్తలు
జాడల నిన్నిటా నేఁడు జాణవైతివే
(॥॥)
ఆయములుసోఁక మాటలాడ నేర్చుకొంటివే
కాయజుదీమవై నీవు గలగితివే
చాయలాను సన్నిలాను సాదించ దొరకొంటివే
పాయవువిభుని నింత భ్రమలఁ బెట్టితివే
(॥॥)
నీటుసెలవినవ్వులు నీవలనఁ గంటిమే
పాటలఁ జొక్కించ నీపాలాయనే
జూటుఁ దనాలకు నీవే సూటియై నిలిచితివే
తాటించి ఆతని నిట్టె దక్కఁగొంటివే
(॥॥)
అలమేలుమంగవు నీ వట భూకాంతను నేను
యెలమి శ్రీవేంకటేశు నెనసితివే
పొలసి నాకత నీతో పొందు లీడెరించితివే
తెలిపి నీవే పట్టపుదేవులవైతివే
(||pallavi||)
sūḍam̐ binnabu sem̐talu sūbi sĕppam̐gam̐ gŏttalu
jāḍala ninniḍā nem̐ḍu jāṇavaidive
(||||)
āyamulusom̐ka māḍalāḍa nersugŏṁṭive
kāyajudīmavai nīvu galagidive
sāyalānu sannilānu sādiṁcha dŏragŏṁṭive
pāyavuvibhuni niṁta bhramalam̐ bĕṭṭidive
(||||)
nīḍusĕlavinavvulu nīvalanam̐ gaṁṭime
pāḍalam̐ jŏkkiṁcha nībālāyane
jūḍum̐ danālagu nīve sūḍiyai nilisidive
tāḍiṁchi ādani niṭṭĕ dakkam̐gŏṁṭive
(||||)
alamelumaṁgavu nī vaḍa bhūgāṁtanu nenu
yĕlami śhrīveṁkaḍeśhu nĕnasidive
pŏlasi nāgada nīdo pŏṁdu līḍĕriṁchidive
tĕlibi nīve paṭṭabudevulavaidive