చూడ వేడుకయ్యీ మాకు సొరిది మిమ్మిద్దరిని
(॥పల్లవి॥)
చూడ వేడుకయ్యీ మాకు సొరిది మిమ్మిద్దరిని
కూడఁగూడ వలపులు కుప్పలాయ మీకును
(॥చూడ॥)
దొంతరమాటలాడి తోక్కె నాపె నీపాదము
వింతమోవిసన్నలనే విందు వెట్టెను
పంతపుఁ జెమటలను పన్నీరు చిలికెంచె
యెంతనేరుపరి యికె యింకా నేమిసేసుకొ
(॥చూడ॥)
కలకల నవ్వు నవ్వి కలపె మేనవావి
పొలపుఁ జూపుల నిన్నుఁ బూజించెను
మొలక నవ్వులను ముత్యాలసేస వెట్టె
పెలుచుఁదమకముల ప్రియమెంత రేఁచునొ
(॥చూడ॥)
పుక్కిటివిడెముల బువ్వములు చేకొనె
మిక్కిలికాఁగిట నిన్ను మెప్పించెను
పక్కన నలమేల్‌మంగపతి శ్రీవేంకటేశుఁడ
తక్కక నన్నేలితివి తానిందు కేమనునో
(||pallavi||)
sūḍa veḍugayyī māgu sŏridi mimmiddarini
kūḍam̐gūḍa valabulu kuppalāya mīgunu
(||sūḍa||)
dŏṁtaramāḍalāḍi tokkĕ nābĕ nībādamu
viṁtamovisannalane viṁdu vĕṭṭĕnu
paṁtabum̐ jĕmaḍalanu pannīru siligĕṁchĕ
yĕṁtanerubari yigĕ yiṁkā nemisesugŏ
(||sūḍa||)
kalagala navvu navvi kalabĕ menavāvi
pŏlabum̐ jūbula ninnum̐ būjiṁchĕnu
mŏlaga navvulanu mutyālasesa vĕṭṭĕ
pĕlusum̐damagamula priyamĕṁta rem̐sunŏ
(||sūḍa||)
pukkiḍiviḍĕmula buvvamulu segŏnĕ
mikkiligām̐giḍa ninnu mĕppiṁchĕnu
pakkana nalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍa
takkaga nannelidivi tāniṁdu kemanuno