Sooda nokkamdavu gaani suddulennainaam galavu

చూడ నొక్కఁడవు గాని సుద్దులెన్నైనాఁ గలవు
Language

(॥పల్లవి॥)
చూడ నొక్కఁడవు గాని సుద్దులెన్నైనాఁ గలవు
వేడుకలు దైవారె వెలఁదు లిందరికి

(॥చూడ॥)
వొక్కని రూపమేకాదా వూరి వా రెల్లాఁ జూచితే
పెక్కులై మనసులోఁ బెనగొనేది
వుక్కున నీ వాడిన మాటొక్కటి కాదా యిందరి
వెక్కసపు వీనులలో వింత వింతలైనది

(॥చూడ॥)
చేసిన నీ సన్నే కాదా చెలుల మర్మములకు
నాస కొలుపుచు మోహ మంటించినది
పొసరించి నీ మోని తీపులే కావా గొల్లెతల
వాసుల నోరులూరించి వలలఁ బెట్టినవి

(॥చూడ॥)
సెలవి నవ్వే కాదా చిమ్మిరేఁచి యింతులకు
వులకలు మేనులఁ బొడమించేది
వెలయ నన్నేలితి శ్రీవేంకటేశ యిదె కాదా
కలయిక లిందరికి కాంక్షలు రేఁచినవి

(||pallavi||)
sūḍa nŏkkam̐ḍavu gāni suddulĕnnainām̐ galavu
veḍugalu daivārĕ vĕlam̐du liṁdarigi

(||sūḍa||)
vŏkkani rūbamegādā vūri vā rĕllām̐ jūside
pĕkkulai manasulom̐ bĕnagŏnedi
vukkuna nī vāḍina māḍŏkkaḍi kādā yiṁdari
vĕkkasabu vīnulalo viṁta viṁtalainadi

(||sūḍa||)
sesina nī sanne kādā sĕlula marmamulagu
nāsa kŏlubusu moha maṁṭiṁchinadi
pŏsariṁchi nī moni tībule kāvā gŏllĕdala
vāsula norulūriṁchi valalam̐ bĕṭṭinavi

(||sūḍa||)
sĕlavi navve kādā simmirem̐si yiṁtulagu
vulagalu menulam̐ bŏḍamiṁchedi
vĕlaya nannelidi śhrīveṁkaḍeśha yidĕ kādā
kalayiga liṁdarigi kāṁkṣhalu rem̐sinavi