Sooda nittunnadi gaani joodumdaname menellaa

చూడ నిట్టున్నది గాని జూటుఁదనమే మేనెల్లా
Language

(॥పల్లవి॥)
చూడ నిట్టున్నది గాని జూటుఁదనమే మేనెల్లా
యీడ నేర్చుకోరాదా యీపెచేత నీవు

(॥చూడ॥)
మనసుమర్మ మెఱుఁగు మాటలాడనేర్చు నాపె
వినరాదా వీనులార వేడుకతోడ
పెనఁగులాడఁగనోపు ప్రియములు చెప్పనోవు
చెనకఁగవలదా నీచేతులకొలఁది

(॥చూడ॥)
చలిమి బలిమి గద్దు చవులు వుట్టించు నాపె
చెలిమి సేయఁగరాదా సిగ్గుపడక
మొలకచన్నుల నొత్తు మొనసి పాదములొత్తు
పిలిచి బుజ్జగించితే పెద్దరికముగాదా

(॥చూడ॥)
కేరి కేరి నీతో నవ్వు కిందుపడి మొక్కునాపె
సారెకుఁ గూడఁగరాదా సమరతుల
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
ఆరమణిపొందులు నీ కంకెకెల్లా వచ్చును

(||pallavi||)
sūḍa niṭṭunnadi gāni jūḍum̐daname menĕllā
yīḍa nersugorādā yībĕseda nīvu

(||sūḍa||)
manasumarma mĕṟum̐gu māḍalāḍanersu nābĕ
vinarādā vīnulāra veḍugadoḍa
pĕnam̐gulāḍam̐ganobu priyamulu sĕppanovu
sĕnagam̐gavaladā nīsedulagŏlam̐di

(||sūḍa||)
salimi balimi gaddu savulu vuṭṭiṁchu nābĕ
sĕlimi seyam̐garādā siggubaḍaga
mŏlagasannula nŏttu mŏnasi pādamulŏttu
pilisi bujjagiṁchide pĕddarigamugādā

(||sūḍa||)
keri keri nīdo navvu kiṁdubaḍi mŏkkunābĕ
sārĕgum̐ gūḍam̐garādā samaradula
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
āramaṇibŏṁdulu nī kaṁkĕgĕllā vachchunu