చూడ నిన్నిటా జాణఁడు చొక్కనాథుఁడు
(॥పల్లవి॥)
చూడ నిన్నిటా జాణఁడు చొక్కనాథుఁడు
వీడెమిచ్చె నాకు నిదె వెసఁ జొక్కనాథుఁడు
(॥॥)
అట్టె నీతోమాటలాడి ఆకెతోడా మాటలాడీఁ
జుట్టమిందరికిఁ గదే చొక్కనాథుఁడు
పట్టి నీకొంగప్పటిని పరాకులాపెపై నించీ
దిట్ట యిన్నిటానుఁ గదే చొక్కనాథుఁడు
(॥॥)
సెలవుల నీతో నవ్వి సిగ్గున నాకెతో నవ్వీ
సులభుఁడే యిన్నిటాను చొక్కనాథుఁడు
వలపు నీపైఁ జల్లి వంతుకాపెకునుఁ జల్లి
అలరి సందడిఁ బెండ్లాడీఁ జొక్కనాథుఁడు
(॥॥)
తగ నిన్నఁ గూడి యాకెఁ దమకించి కూడెను
సుగుడ యిన్నిటాఁ గదే చొక్కనాథుఁడు
అగపడి శ్రీవేంకటాదిపై నన్నునేలెను
తగవరి దానే కదే తతిఁ జొక్కనాథుఁడు
(||pallavi||)
sūḍa ninniḍā jāṇam̐ḍu sŏkkanāthum̐ḍu
vīḍĕmichchĕ nāgu nidĕ vĕsam̐ jŏkkanāthum̐ḍu
(||||)
aṭṭĕ nīdomāḍalāḍi āgĕdoḍā māḍalāḍīm̐
juṭṭamiṁdarigim̐ gade sŏkkanāthum̐ḍu
paṭṭi nīgŏṁgappaḍini parāgulābĕbai niṁchī
diṭṭa yinniḍānum̐ gade sŏkkanāthum̐ḍu
(||||)
sĕlavula nīdo navvi sigguna nāgĕdo navvī
sulabhum̐ḍe yinniḍānu sŏkkanāthum̐ḍu
valabu nībaim̐ jalli vaṁtugābĕgunum̐ jalli
alari saṁdaḍim̐ bĕṁḍlāḍīm̐ jŏkkanāthum̐ḍu
(||||)
taga ninnam̐ gūḍi yāgĕm̐ damagiṁchi kūḍĕnu
suguḍa yinniḍām̐ gade sŏkkanāthum̐ḍu
agabaḍi śhrīveṁkaḍādibai nannunelĕnu
tagavari dāne kade tadim̐ jŏkkanāthum̐ḍu