చూడ నీ కెట్టున్నదో నా సొబగు నీకు
(॥పల్లవి॥)
చూడ నీ కెట్టున్నదో నా సొబగు నీకు
వేడుక సేసీ నాకు విభునిపై తలఁపు
(॥॥)
చెక్కుపై నే చేయిగాని చిత్తము లోపలఁ దానే
యెక్కడిదే నాకుఁ జింత ఇంతలోఁ జెలి
ముక్కుపై నే వేలు గాని ముంచి నూర్పు దనకుఁగా
నెక్కొన నాపై నేదే నివ్వెఱఁగు నేఁడు
(॥॥)
పానుపుపై మేను గాని పలు కాతనిపే రెంచి
ఆనుక యేడ నున్నదే అలపు నాకు
వీను లాస కొల్పీఁగాని విని కాతని గుణాలే
తానకమై మరి యేదే తడఁబాటు నేఁడు
(॥॥)
చూపులే దవ్వులు గాని చుట్ట రికము చేరువ
యే పొద్దు నిఁక నేడదే యెరపు మరి
యేపున శ్రీ వేంకటేశుఁ డితఁడే తా నన్నుఁగూడె
పై పై నెందున్నదే పరాకు నేఁడు
(||pallavi||)
sūḍa nī kĕṭṭunnado nā sŏbagu nīgu
veḍuga sesī nāgu vibhunibai talam̐pu
(||||)
sĕkkubai ne seyigāni sittamu lobalam̐ dāne
yĕkkaḍide nāgum̐ jiṁta iṁtalom̐ jĕli
mukkubai ne velu gāni muṁchi nūrbu danagum̐gā
nĕkkŏna nābai nede nivvĕṟam̐gu nem̐ḍu
(||||)
pānububai menu gāni palu kādanibe rĕṁchi
ānuga yeḍa nunnade alabu nāgu
vīnu lāsa kŏlbīm̐gāni vini kādani guṇāle
tānagamai mari yede taḍam̐bāḍu nem̐ḍu
(||||)
sūbule davvulu gāni suṭṭa rigamu seruva
ye pŏddu nim̐ka neḍade yĕrabu mari
yebuna śhrī veṁkaḍeśhum̐ ḍidam̐ḍe tā nannum̐gūḍĕ
pai pai nĕṁdunnade parāgu nem̐ḍu