చూడ ముద్దరాలుగాని జూటరి యిది
(॥పల్లవి॥)
చూడ ముద్దరాలుగాని జూటరి యిది
యేద నీపె నెట్టు గడియించుకొంటివయ్యా
(॥చూడ॥)
కదలుఁగన్నులఁ జూచి కప్పురము గానుకిచ్చి
పెదవుల మాటలాడి బెల్లించీ నాకె
వెదచల్లి నేరుపుల వేడుకలు నీకుఁజేసి
యెదుటనే నిలుచుండి యెలయించీ నిన్నును
(॥చూడ॥)
తరితీపుమాట లాడి తమకము నీకు రేఁచ
తెరమాఁటువలపులఁ దేలించీ నాకె
వొరపులు నీకుఁజూపి వొడిఁబెట్టి వావులు
గరిమలఁ జొక్కించి కరఁగించీ నిన్నును
(॥చూడ॥)
జోకగాఁ బ్రియాలు చెప్పి చుట్టరికాలు నటించి
మేకులనే నిన్నుఁ గూడి మెప్పించీ నాకె
పైకొని యలమేల్ మంగపతి శ్రీవేంకటేశుఁడ
నాకు మగఁడవైతివి నవ్వించీఁదా నిన్నును
(||pallavi||)
sūḍa muddarālugāni jūḍari yidi
yeda nībĕ nĕṭṭu gaḍiyiṁchugŏṁṭivayyā
(||sūḍa||)
kadalum̐gannulam̐ jūsi kappuramu gānugichchi
pĕdavula māḍalāḍi bĕlliṁchī nāgĕ
vĕdasalli nerubula veḍugalu nīgum̐jesi
yĕduḍane nilusuṁḍi yĕlayiṁchī ninnunu
(||sūḍa||)
taridībumāḍa lāḍi tamagamu nīgu rem̐sa
tĕramām̐ṭuvalabulam̐ deliṁchī nāgĕ
vŏrabulu nīgum̐jūbi vŏḍim̐bĕṭṭi vāvulu
garimalam̐ jŏkkiṁchi karam̐giṁchī ninnunu
(||sūḍa||)
jogagām̐ briyālu sĕppi suṭṭarigālu naḍiṁchi
megulane ninnum̐ gūḍi mĕppiṁchī nāgĕ
paigŏni yalamel maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍa
nāgu magam̐ḍavaidivi navviṁchīm̐dā ninnunu