Sooda mimkam dana laagu soobi neegu vatti siggu

చూత మిఁకఁ దన లాగు చూపి నీకు వట్టి సిగ్గు
Language

(॥పల్లవి॥)
చూత మిఁకఁ దన లాగు చూపి నీకు వట్టి సిగ్గు
చేతికి లోఁ జేసుక చెనకఁగ రాదా

(॥॥)
చెలియ సిగ్గులతోడఁ జిత్తరువు వ్రాసి కొంకి
నిలిచి తను దట్టించీ నీవు చూడఁగా
వులివచ్చి మాటలాడీ వొడివట్టి తియ్యరాదా
చెలరేఁగి యప్పు డేమి సేసీనో కాని

(॥॥)
కోమలి పరాకు సేసుకొని చెలితో మాటాడీ
వేమారు నీవు దన్ను వేఁడుకొఁగాను
చేముంచి చన్నుల మీఁదఁ జేయి చాఁచఁగా రాదా
దీమస మెంత గద్దో తేలుతుము గాని

(॥॥)
నెలత వొయ్యారముతో నిమ్మవం డెగరవేసీ
లలి నీవు తమి రేఁచి లాలించఁగా
అలర శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
కలసితి వేమి నేర్పు గైకొనీనో కాని

(||pallavi||)
sūda mim̐kam̐ dana lāgu sūbi nīgu vaṭṭi siggu
sedigi lom̐ jesuga sĕnagam̐ga rādā

(||||)
sĕliya sigguladoḍam̐ jittaruvu vrāsi kŏṁki
nilisi tanu daṭṭiṁchī nīvu sūḍam̐gā
vulivachchi māḍalāḍī vŏḍivaṭṭi tiyyarādā
sĕlarem̐gi yappu ḍemi sesīno kāni

(||||)
komali parāgu sesugŏni sĕlido māḍāḍī
vemāru nīvu dannu vem̐ḍugŏm̐gānu
semuṁchi sannula mīm̐dam̐ jeyi sām̐sam̐gā rādā
dīmasa mĕṁta gaddo teludumu gāni

(||||)
nĕlada vŏyyāramudo nimmavaṁ ḍĕgaravesī
lali nīvu tami rem̐si lāliṁcham̐gā
alara śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ
kalasidi vemi nerbu gaigŏnīno kāni