Sooda mimka tanajaada solayaga neevu raave

చూత మింక తనజాడ సొలయక నీవు రావే
Language

(॥పల్లవి॥)
చూత మింక తనజాడ సొలయక నీవు రావే
కాతరపు రమణుని కడకుఁ బోనిచ్చేనా

(॥చూత॥)
తలఁ పెందునిల్చినా తానూ నక్కడ నిల్చు
యెలమి నెంత విల్చినా యేలవచ్చీనే
పలుకేడ నిఁ(నిం)పైనా భావమందింపౌను
తెలిసి నీవు మాటాడితే నేల చేకొనీనే

(॥చూత॥)
కనుచూ పెందువారిన కందువ లందు వారు
పనివడి వానినేల బల్మి సేసేవే
తని వెందు గలిగినా తమక మందే కలుగు
వెనుకొ నంతే శతని వేసట సేయకువే

(॥చూత॥)
కాఁక లెంతవిరివైనాఁ గాఁగి లంత విరివౌను
వీఁకల నాతని నేమి వేఁడుకోకువే
వేఁకపు శ్రీవేంకటాద్రి విభుఁడు నన్నిటుగూడె
యేఁకట వాసె నింక నేమీ ననకువే

(||pallavi||)
sūda miṁka tanajāḍa sŏlayaga nīvu rāve
kādarabu ramaṇuni kaḍagum̐ bonichchenā

(||sūda||)
talam̐ pĕṁdunilsinā tānū nakkaḍa nilsu
yĕlami nĕṁta vilsinā yelavachchīne
palugeḍa nim̐(niṁ)painā bhāvamaṁdiṁpaunu
tĕlisi nīvu māḍāḍide nela segŏnīne

(||sūda||)
kanusū pĕṁduvārina kaṁduva laṁdu vāru
panivaḍi vāninela balmi seseve
tani vĕṁdu galiginā tamaga maṁde kalugu
vĕnugŏ naṁte śhadani vesaḍa seyaguve

(||sūda||)
kām̐ka lĕṁtavirivainām̐ gām̐gi laṁta virivaunu
vīm̐kala nādani nemi vem̐ḍugoguve
vem̐kabu śhrīveṁkaḍādri vibhum̐ḍu nanniḍugūḍĕ
yem̐kaḍa vāsĕ niṁka nemī nanaguve