చూడ మాకు వేడుకయ్యా సోద్యపు నీ చేఁతలెల్లా
(॥పల్లవి॥)
చూడ మాకు వేడుకయ్యా సోద్యపు నీ చేఁతలెల్లా
వీడరాని పొందులైతే వెలవెట్టవచ్చునా
(॥చూడ॥)
చెక్కు చెమరించెనంటా చేసురటి విసరేవు
యిక్కువ నాకెపై నీకు నెంతమోహమో
చక్కనివదనమని సారె సారెఁ బొగడేవు
పిక్కటిల్ల నీకె యెంతప్రియమో ఇపుడు
(॥చూడ॥)
కడు దిష్టదాఁకకుండా కప్పేవు పైపచ్చడము
తడయక లోలో నెంత తగులాయమో
బడిబడి గుబ్బలపై పన్నీరు చిలికించేవు
అడరి నీ కిది యెంత అపురూపమో
(॥చూడ॥)
గాలి యెండా సోఁకకుండా కాఁగిట నించుకోనేవు
యీలీల నలమేల్ మంగ యెంతచుట్టమో
యేలితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనె
ఔలే నీమదిలోన నాసోదమెంతో
(||pallavi||)
sūḍa māgu veḍugayyā sodyabu nī sem̐talĕllā
vīḍarāni pŏṁdulaide vĕlavĕṭṭavachchunā
(||sūḍa||)
sĕkku sĕmariṁchĕnaṁṭā sesuraḍi visarevu
yikkuva nāgĕbai nīgu nĕṁtamohamo
sakkanivadanamani sārĕ sārĕm̐ bŏgaḍevu
pikkaḍilla nīgĕ yĕṁtapriyamo ibuḍu
(||sūḍa||)
kaḍu diṣhṭadām̐kaguṁḍā kappevu paibachchaḍamu
taḍayaga lolo nĕṁta tagulāyamo
baḍibaḍi gubbalabai pannīru siligiṁchevu
aḍari nī kidi yĕṁta aburūbamo
(||sūḍa||)
gāli yĕṁḍā som̐kaguṁḍā kām̐giḍa niṁchugonevu
yīlīla nalamel maṁga yĕṁtasuṭṭamo
yelidivi śhrīveṁkaḍeśha nannu niṁtalonĕ
aule nīmadilona nāsodamĕṁto