Sommu galavaamdavu sompu gani yichche kaamka

సొమ్ము గలవాఁడవు సోఁపు గని యిచ్చె కాఁక
Language

(॥పల్లవి॥)
సొమ్ము గలవాఁడవు సోఁపు గని యిచ్చె కాఁక
సమ్మతిఁ గాక వంచన సేయ వచ్చునా

(॥సొమ్ము॥)
సిగ్గువ డుండుత గాక చెనకే నీ చేఁతలకు
తగ్గి తప్పించుకొంటేను తప్పు లెంచవా
వొగ్గి మొదలనె నీకు వొప్పగించిన దీ మేను
దగ్గరి పైకొంట గాక దాఁచ వచ్చునా

(॥సొమ్ము॥)
మోనాన నుండుత గాక మోహపు నీ మాటలకు
దానికె నే మారాడితేఁ దమకించవా
నానినది మొదలనె నానోరు నీ యెంగిటనె
పూని పట్టుకుందుఁ గాక బొంకె నన వచ్చునా

(॥సొమ్ము॥)
ఆసతో నుండుత గాక అంటిన నీరతులకు
వీస మంత నే మీరినా వెర గందవా
నీ సొమ్ము మొదలనె నా నెయ్యము శ్రీవెంకటేశ
మూసి దాఁచుకుందుఁగాక మొరఁగఁగ వచ్చునా

(||pallavi||)
sŏmmu galavām̐ḍavu som̐pu gani yichchĕ kām̐ka
sammadim̐ gāga vaṁchana seya vachchunā

(||sŏmmu||)
sigguva ḍuṁḍuda gāga sĕnage nī sem̐talagu
taggi tappiṁchugŏṁṭenu tappu lĕṁchavā
vŏggi mŏdalanĕ nīgu vŏppagiṁchina dī menu
daggari paigŏṁṭa gāga dām̐sa vachchunā

(||sŏmmu||)
monāna nuṁḍuda gāga mohabu nī māḍalagu
dānigĕ ne mārāḍidem̐ damagiṁchavā
nāninadi mŏdalanĕ nānoru nī yĕṁgiḍanĕ
pūni paṭṭuguṁdum̐ gāga bŏṁkĕ nana vachchunā

(||sŏmmu||)
āsado nuṁḍuda gāga aṁṭina nīradulagu
vīsa maṁta ne mīrinā vĕra gaṁdavā
nī sŏmmu mŏdalanĕ nā nĕyyamu śhrīvĕṁkaḍeśha
mūsi dām̐suguṁdum̐gāga mŏram̐gam̐ga vachchunā