Sollebumjutla vo sokkanaathaa nee

చొల్లెపుఁజుట్ల వో చొక్కనాథా నీ
Language

(॥పల్లవి॥)
చొల్లెపుఁజుట్ల వో చొక్కనాథా నీ-
చుల్లరిచేఁతలు గంటిఁ జొక్కనాథా

(॥చొల్లె॥)
చూడ వేగన్నుల నిన్నుఁ జొక్కనాథా నీకు
జోడు భూమియును లక్ష్మిఁ జొక్కనాథా
సూడిదె నాపాయమిదె చొక్కనాథా నీతో
సూడువట్టీ నారతులు చొక్కనాథా

(॥చొల్లె॥)
చొక్కపు సింగారాల చొక్కనాథా మోవిఁ
జుక్కలు నించె నెవ్వతో చొక్కనాథా
చొక్కించితి గోపికలఁ జొక్కనాథా నాతో
సుక్కులమాట లేలోయి చొక్కనాథా

(॥చొల్లె ॥)
సొమ్ముతొవిఱ్ణవిగేచొక్కనాథా పోదు-
సుమ్మీ నీకు నాకుఁ జొక్కనాథా
ఇమ్ముల శ్రీవేంకటాద్రి నిటు నీవు గూడఁగాను
జుమ్మన మై పులకించెఁ జొక్కనాథా

(||pallavi||)
sŏllĕbum̐juṭla vo sŏkkanāthā nī-
sullarisem̐talu gaṁṭim̐ jŏkkanāthā

(||sŏllĕ||)
sūḍa vegannula ninnum̐ jŏkkanāthā nīgu
joḍu bhūmiyunu lakṣhmim̐ jŏkkanāthā
sūḍidĕ nābāyamidĕ sŏkkanāthā nīdo
sūḍuvaṭṭī nāradulu sŏkkanāthā

(||sŏllĕ||)
sŏkkabu siṁgārāla sŏkkanāthā movim̐
jukkalu niṁchĕ nĕvvado sŏkkanāthā
sŏkkiṁchidi gobigalam̐ jŏkkanāthā nādo
sukkulamāḍa leloyi sŏkkanāthā

(||sŏllĕ ||)
sŏmmudŏviṟṇavigesŏkkanāthā podu-
summī nīgu nāgum̐ jŏkkanāthā
immula śhrīveṁkaḍādri niḍu nīvu gūḍam̐gānu
jummana mai pulagiṁchĕm̐ jŏkkanāthā