చొల్లెపుఁ జుట్లతోడి చుంగుల రాజసముతో
(॥పల్లవి॥)
చొల్లెపుఁ జుట్లతోడి చుంగుల రాజసముతో
వెల్లవిరిగా నేఁగేరు వీడెపు మోవులను
(॥చొల్లె॥)
అంగనకుఁ దనపాదా లంకవన్నెలు సేసుక
రంగుగాఁ దొడఁదొడయు రాయఁగాను
సింగారపు సొమ్ములతో చెంగావి ముఁసుగుతోడ-
నంగవించీ యాపె దన కాసలు రేఁచఁగను
(॥చొల్లె॥)
కదలు కదలుకును కాంత వాలారుగోళ్ళ
నదిమి యదిమి తన్ను నంటఁబట్టఁగ
ముదిత యాకు మడిచి మోవినె అందీయఁగాను
మదనపరవశాన మలసీని వీఁడిదివో
(॥చొల్లె॥)
కలకలనవ్వులతోడ కస్తూరి నామముతోడ
అలమేలుమంగ దన్ను నట్టే మెచ్చఁగా
యెలమి శ్రీవేంకటేశుఁ డేతులు నెరపుతాను
బలిమి నంకుశమునఁ బట్టి వొత్తీనదివో
(||pallavi||)
sŏllĕbum̐ juṭladoḍi suṁgula rājasamudo
vĕllavirigā nem̐geru vīḍĕbu movulanu
(||sŏllĕ||)
aṁganagum̐ danabādā laṁkavannĕlu sesuga
raṁgugām̐ dŏḍam̐dŏḍayu rāyam̐gānu
siṁgārabu sŏmmulado sĕṁgāvi mum̐sugudoḍa-
naṁgaviṁchī yābĕ dana kāsalu rem̐sam̐ganu
(||sŏllĕ||)
kadalu kadalugunu kāṁta vālārugoḽḽa
nadimi yadimi tannu naṁṭam̐baṭṭam̐ga
mudida yāgu maḍisi movinĕ aṁdīyam̐gānu
madanabaravaśhāna malasīni vīm̐ḍidivo
(||sŏllĕ||)
kalagalanavvuladoḍa kastūri nāmamudoḍa
alamelumaṁga dannu naṭṭe mĕchcham̐gā
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍedulu nĕrabudānu
balimi naṁkuśhamunam̐ baṭṭi vŏttīnadivo