Solaside paayaraani suttamavu neevu naagu

సొలసితే పాయరాని చుట్టమవు నీవు నాకు
Language

(॥పల్లవి॥)
సొలసితే పాయరాని చుట్టమవు నీవు నాకు
నెలకొంటివి నామతి నీవే యెఱుఁగుదువు

(॥॥)
పిలిచి చేపట్టితేను బెళకి తప్పించుకోకు
వలపులు చల్లితేను వంచకు తల
మోలనూలు వట్టఁగానే మోరతోపుఁదనమేల
చెలువుఁడ మారుమోము సేసుక నవ్వేవు

(॥॥)
పొందులు సేయఁగాను పొడవు దాఁచకు మిఁక
కందువనే పతినలు కడుఁజూపేవు
మందలించి చెనకితే మల సేవు రాజసాన
విందువలె మేనంటితే వెలవెలఁబారేవు

(॥॥)
సారె బుద్దులడిగితే చల్లేవు సిగ్గులెలా
కోరి చూచితే పాడేవు గుఱ్ఱముమీఁద
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
తారుకాణ సేసేవు దశావస్థలూను

(||pallavi||)
sŏlaside pāyarāni suṭṭamavu nīvu nāgu
nĕlagŏṁṭivi nāmadi nīve yĕṟum̐guduvu

(||||)
pilisi sebaṭṭidenu bĕḽagi tappiṁchugogu
valabulu sallidenu vaṁchagu tala
molanūlu vaṭṭam̐gāne moradobum̐danamela
sĕluvum̐ḍa mārumomu sesuga navvevu

(||||)
pŏṁdulu seyam̐gānu pŏḍavu dām̐sagu mim̐ka
kaṁduvane padinalu kaḍum̐jūbevu
maṁdaliṁchi sĕnagide mala sevu rājasāna
viṁduvalĕ menaṁṭide vĕlavĕlam̐bārevu

(||||)
sārĕ buddulaḍigide sallevu siggulĕlā
kori sūside pāḍevu guṭramumīm̐da
yīrīdi śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
tārugāṇa sesevu daśhāvasthalūnu