చొక్కపు నీ పెండ్లి నేఁడె సుక్కురారము
(॥పల్లవి॥)
చొక్కపు నీ పెండ్లి నేఁడె సుక్కురారము
అక్కరతో నిన్నియు నవధరించవయ్యా
(॥॥)
పడఁతిచెమటలే పన్నీటిజలకము
వెడగుముద్దుమాటలు వేదమంత్రాలు
యెడమని యాకెపయ్యదకొంగే తడియొత్తు
అడియాలపుమజ్జన మవధరించవయ్యా
(॥॥)
తరుణిసెలవినవ్వు తగినకప్పురకాపు
తరమైనకనుచూపు తట్టుపుణుఁగు
విరులతావివూర్పులే విసరేటిచల్లగాలి
అరుదైనవుపచార మవధరించవయ్యా
(॥॥)
అలమేలుమంగకాఁగి లంటుదామెరల పూజ
పొలివోనిమేనికాంతి భూషణములు
యెలమి శ్రీ వేంకటేశ ఇద్దరునుఁ గూడితిరి
అలవడె విభవము లవధరించవయ్యా
(||pallavi||)
sŏkkabu nī pĕṁḍli nem̐ḍĕ sukkurāramu
akkarado ninniyu navadhariṁchavayyā
(||||)
paḍam̐tisĕmaḍale pannīḍijalagamu
vĕḍagumuddumāḍalu vedamaṁtrālu
yĕḍamani yāgĕbayyadagŏṁge taḍiyŏttu
aḍiyālabumajjana mavadhariṁchavayyā
(||||)
taruṇisĕlavinavvu taginagappuragābu
taramainaganusūbu taṭṭubuṇum̐gu
viruladāvivūrbule visareḍisallagāli
arudainavubasāra mavadhariṁchavayyā
(||||)
alamelumaṁgagām̐gi laṁṭudāmĕrala pūja
pŏlivonimenigāṁti bhūṣhaṇamulu
yĕlami śhrī veṁkaḍeśha iddarunum̐ gūḍidiri
alavaḍĕ vibhavamu lavadhariṁchavayyā