Sodimchi soodambode soosi maṟabu

సోదించి చూడఁబోతే చూచి మఱపు
Language

(॥పల్లవి॥)
సోదించి చూడఁబోతే చూచి మఱపు
వో దేవదేవ మించె నోహో నీ మాయ

(॥సోదిం॥)
వొక్కటే పదార్థము వూరివారెల్లాఁ జూచితే
గుక్కిళ్లు మింగించి యాసకొలుపుచుండు
మక్కళిం చెందరిలోని మనసులు వేరు వేరో
వొక్కటో యేమనవచ్చు నోహో నీమాయ

(॥సోదిం॥)
ధరలో బిడ్డ వొక్కటి తల్లిదండ్రులిద్దరు
తొరలింపు వేడుకలై తోఁచుచుండు
పెరిగేటి పుట్టుగులు భేదమో అభేదమో
వొరుల కేమనవచ్చు నోహో నీమాయ

(॥సోదిం॥)
కోరే మోక్ష మొక్కటే కొలచే దిద్దరినట
చేరే ని న్నలమేల్మంగ శ్రీవేంకటేశ
మీరిద్దరు నేకమౌ మీభావాలే వింతలో
వూరకే యేమనవచ్చు నోహో నీమాయ

(||pallavi||)
sodiṁchi sūḍam̐bode sūsi maṟabu
vo devadeva miṁchĕ noho nī māya

(||sodiṁ||)
vŏkkaḍe padārdhamu vūrivārĕllām̐ jūside
gukkiḽlu miṁgiṁchi yāsagŏlubusuṁḍu
makkaḽiṁ sĕṁdariloni manasulu veru vero
vŏkkaḍo yemanavachchu noho nīmāya

(||sodiṁ||)
dharalo biḍḍa vŏkkaḍi tallidaṁḍruliddaru
tŏraliṁpu veḍugalai tom̐susuṁḍu
pĕrigeḍi puṭṭugulu bhedamo abhedamo
vŏrula kemanavachchu noho nīmāya

(||sodiṁ||)
kore mokṣha mŏkkaḍe kŏlase diddarinaḍa
sere ni nnalamelmaṁga śhrīveṁkaḍeśha
mīriddaru negamau mībhāvāle viṁtalo
vūrage yemanavachchu noho nīmāya