Sobanamu sobanamu soodare peradaamdlu

సోబనము సోబనము చూడరే పేరటాండ్లు
Language

(॥పల్లవి॥)
సోబనము సోబనము చూడరే పేరటాండ్లు
ఆ బలభద్రుఁడు ముందే యవతరించినాఁడు

(॥సొబ॥)
జనియించె గృష్ణుడు సతమాయ ధర్మములు
జననీజనకులకు సంతోసమాయ
ననిచి యశోదానందగోపులు వెంచేరు
వొనర నందరికిని వొక్కమనసాయ

(॥సొబ॥)
నాలుగుచేతులవాఁడు నల్లని మేనివాఁడు
మేలిమి సంకు జక్రాల మించినవాఁడు
కోలుముందుగాం గంసునిగుండెదిగులైనవాఁడు
వొలార్చరే యిందరికి నొక్కమనసాయను

(॥సొబ॥)
కోరికె లీడెరెను గోపికలకెల్లాను
తేరి కరుణించి మనదిక్కు చూచీని
గారవపుటల మేల్మంగపతి శ్రీవేంకటేశు-
నూరడిఁచరే యిందరికి నొక్కమనసాయను

(||pallavi||)
sobanamu sobanamu sūḍare peraḍāṁḍlu
ā balabhadrum̐ḍu muṁde yavadariṁchinām̐ḍu

(||sŏba||)
janiyiṁchĕ gṛṣhṇuḍu sadamāya dharmamulu
jananījanagulagu saṁtosamāya
nanisi yaśhodānaṁdagobulu vĕṁcheru
vŏnara naṁdarigini vŏkkamanasāya

(||sŏba||)
nālugusedulavām̐ḍu nallani menivām̐ḍu
melimi saṁku jakrāla miṁchinavām̐ḍu
kolumuṁdugāṁ gaṁsuniguṁḍĕdigulainavām̐ḍu
vŏlārsare yiṁdarigi nŏkkamanasāyanu

(||sŏba||)
korigĕ līḍĕrĕnu gobigalagĕllānu
teri karuṇiṁchi manadikku sūsīni
gāravabuḍala melmaṁgabadi śhrīveṁkaḍeśhu-
nūraḍim̐sare yiṁdarigi nŏkkamanasāyanu