సోబానఁ బాడేము మేము సుదతులము
(॥పల్లవి॥)
సోబానఁ బాడేము మేము సుదతులము
యీబుద్దులు మీకుఁ జెల్లు నిద్దరికి నయ్యా
(॥సోబా॥)
చూపులనే వుంకువలు సుదతికిఁ బెట్టితివి
పూపనవ్వులు మించేకప్పువిడేలు
యేపుమీరి నవ్వులనే యెదురుతెర వేసితి-
వీపొద్దే పెండ్లాయను మీకిద్దరికినయ్యా
(॥సోబా॥)
తరితీపుమాటనే తలఁబాలు వోసితి
గరిమ సరసములే కంకణాలు
గొరబైనవలపుల కొంగులు ముళ్లువేసితి-
విరవాయ వేడుకలు ఇద్దరికినయ్యా
(॥సోబా॥)
పొంచినకెమ్మోవినే బువ్వపువిందు వెట్టితి
మంచముపై కాఁగిలే మంచిచవికె
అంచలశ్రీవేంకటేశ అలమేలుమంగ నీవు
యెంచి కూడితిరి తగు నిద్దరికినయ్యా
(||pallavi||)
sobānam̐ bāḍemu memu sudadulamu
yībuddulu mīgum̐ jĕllu niddarigi nayyā
(||sobā||)
sūbulane vuṁkuvalu sudadigim̐ bĕṭṭidivi
pūbanavvulu miṁchegappuviḍelu
yebumīri navvulane yĕdurudĕra vesidi-
vībŏdde pĕṁḍlāyanu mīgiddariginayyā
(||sobā||)
taridībumāḍane talam̐bālu vosidi
garima sarasamule kaṁkaṇālu
gŏrabainavalabula kŏṁgulu muḽluvesidi-
viravāya veḍugalu iddariginayyā
(||sobā||)
pŏṁchinagĕmmovine buvvabuviṁdu vĕṭṭidi
maṁchamubai kām̐gile maṁchisavigĕ
aṁchalaśhrīveṁkaḍeśha alamelumaṁga nīvu
yĕṁchi kūḍidiri tagu niddariginayyā