Sittinigunamudodam jenagee ninnu

చిత్తిణిగుణముతోడఁ జెనకీ నిన్ను
Language

(॥పల్లవి॥)
చిత్తిణిగుణముతోడఁ జెనకీ నిన్ను
హత్తుక అడుగవయ్య ఆపె పేరు నీవు

(॥చిత్తి॥)
ఇద్దరముఁ బండుండఁగ యెవ్వతో సోరణగండ్ల
వొద్దికఁ దామరకామ నొరసీ నిన్ను
కొద్దిమీరఁగా చిమ్మనఁగొవినిఁ బన్నీరు నించి
ఆద్దుకొనఁ జిమ్మవయ్య ఆపెమీఁద నీవును

(॥చిత్తి॥)
నెయ్యపువేడుకతో నీవు నేను మాటాడఁగ
పడి అవ్వలనుండి పాటవాడీని
కొయ్యతనపమాటల గరిమితో నొట్టువెట్టి
నెన బిలువవయ్య నీవు నీడ కాపను

(॥చిత్తి॥)
ఆలుమేలుమంగపతివైనంతో నే నవ్వగా
తలుపు దురువుమని తట్టీఁ జేతుల
యెలమి శ్రీవేంకటేశ యేచితివి నన్ను నిట్టె
కలయవయ్య ఆమెను కామించివున్నది

(||pallavi||)
sittiṇiguṇamudoḍam̐ jĕnagī ninnu
hattuga aḍugavayya ābĕ peru nīvu

(||sitti||)
iddaramum̐ baṁḍuṁḍam̐ga yĕvvado soraṇagaṁḍla
vŏddigam̐ dāmaragāma nŏrasī ninnu
kŏddimīram̐gā simmanam̐gŏvinim̐ bannīru niṁchi
āddugŏnam̐ jimmavayya ābĕmīm̐da nīvunu

(||sitti||)
nĕyyabuveḍugado nīvu nenu māḍāḍam̐ga
paḍi avvalanuṁḍi pāḍavāḍīni
kŏyyadanabamāḍala garimido nŏṭṭuvĕṭṭi
nĕna biluvavayya nīvu nīḍa kābanu

(||sitti||)
ālumelumaṁgabadivainaṁto ne navvagā
talubu duruvumani taṭṭīm̐ jedula
yĕlami śhrīveṁkaḍeśha yesidivi nannu niṭṭĕ
kalayavayya āmĕnu kāmiṁchivunnadi