చిత్తమురానే మెలఁగి సేవలు సేయుటగాక
(॥పల్లవి॥)
చిత్తమురానే మెలఁగి సేవలు సేయుటగాక
బత్తిగల యీకె నిట్టె పాలించవయ్యా
(॥॥)
మగవాని మరిగిన మానవతులకు మరి
పగచాటఁ జోటేది పంతమేడది
నగుతానే సరసము నటియించేవారికి
తెగువలెట్ల జెల్లు దీకొనుట యెట్లు
(॥॥)
పతివఁతలై న యట్టి పడతులకును భువి
నతికడుచుట యెట్టు అలిగేదేమి
రతిసేసి వలపుల రమియించేవారికి
మితిమీరఁ బనియేమి మేకుసేయనేల
(॥॥)
పెనిమిటివద్దనున్న ప్రియురాండ్లకును
కినియఁ గ నెట్టువచ్చు కెరలవేది
యెనసితి శ్రీ వేంటేశయలఁమేల్మంగను
చెనకికొసరుటెంత సిగ్గులువడుటేడ
(||pallavi||)
sittamurāne mĕlam̐gi sevalu seyuḍagāga
battigala yīgĕ niṭṭĕ pāliṁchavayyā
(||||)
magavāni marigina mānavadulagu mari
pagasāḍam̐ joḍedi paṁtameḍadi
nagudāne sarasamu naḍiyiṁchevārigi
tĕguvalĕṭla jĕllu dīgŏnuḍa yĕṭlu
(||||)
padivam̐talai na yaṭṭi paḍadulagunu bhuvi
nadigaḍusuḍa yĕṭṭu aligedemi
radisesi valabula ramiyiṁchevārigi
midimīram̐ baniyemi meguseyanela
(||||)
pĕnimiḍivaddanunna priyurāṁḍlagunu
kiniyam̐ ga nĕṭṭuvachchu kĕralavedi
yĕnasidi śhrī veṁṭeśhayalam̐melmaṁganu
sĕnagigŏsaruḍĕṁta sigguluvaḍuḍeḍa