చిత్తమురాఁ దనసేవ సేసేఁగాక
(॥పల్లవి॥)
చిత్తమురాఁ దనసేవ సేసేఁగాక
హత్తి నన్ను మోవి చవు లడుగఁగవలెనా
(॥చిత్త॥)
యెప్పడు దా నేమనినా నియ్యకొని నిచ్చేఁగాక
తప్పలు వెదకేనా తనతో(లో?) నేను
ముప్పిరి దనకు నేను మోహించివున్నదాన
చొప్పలెత్తి నామనసు సోదించవలెనా
(॥చిత్త॥)
గక్కనఁ జన్నులంటితే కానిమ్మని చొక్కెఁగాక
తక్కరికై పెనఁగేనా తనతోనేను
అక్కరఁ దనకు నేనాలనైతి నప్పడే
ప్కన నన్నింత వొడఁ బరచఁగ వలెనా
(॥చిత్త॥)
వొత్తి నన్నుఁ జెనకితే వొప్పుగొని వుండేఁగాక
తత్తరించి కొసరేనా తనతో నేను
యిత్తల శ్రీవేంకటేశుఁ డేలె నన్నుఁదగులైతి
కొత్తలుగా నన్ను వేఁడుకొన నింత వలెనా
(||pallavi||)
sittamurām̐ danaseva sesem̐gāga
hatti nannu movi savu laḍugam̐gavalĕnā
(||sitta||)
yĕppaḍu dā nemaninā niyyagŏni nichchem̐gāga
tappalu vĕdagenā tanado(lo?) nenu
muppiri danagu nenu mohiṁchivunnadāna
sŏppalĕtti nāmanasu sodiṁchavalĕnā
(||sitta||)
gakkanam̐ jannulaṁṭide kānimmani sŏkkĕm̐gāga
takkarigai pĕnam̐genā tanadonenu
akkaram̐ danagu nenālanaidi nappaḍe
pkana nanniṁta vŏḍam̐ barasam̐ga valĕnā
(||sitta||)
vŏtti nannum̐ jĕnagide vŏppugŏni vuṁḍem̐gāga
tattariṁchi kŏsarenā tanado nenu
yittala śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannum̐dagulaidi
kŏttalugā nannu vem̐ḍugŏna niṁta valĕnā