చిత్తమురా నాతనికి చేత మొక్కవే
(॥పల్లవి॥)
చిత్తమురా నాతనికి చేత మొక్కవే
బత్తిసేయఁగా పంతము పచరించఁ దగునా
(॥చిత్తము॥)
చెలువుఁడు మాటలాడీ చెక్కుచేయి దియ్యఁగదే
యెలమి నీతలపోఁతలిఁక నేఁటికే
కలదెల్లా నీవితనిఁ గన్నదాఁకానే కాక
తొలుతటి సుద్దులిఁకఁ దొరలించఁ దగునా
(॥చిత్తము॥)
తానే యాతఁడు నవ్వీని తప్పక చూడఁగదవే
మానవే వట్టిచింతలు మరి యేఁటికే
పూనిక లివన్నియును పొందినదాఁకానే కాక
కేనములు తొల్లిటివి కెరలించఁ దగునా
(॥చిత్తము॥)
శ్రీవేంకటేశుఁడు గూడె సేవలు సేయఁగదవే
యేవియుఁ దడవనేల యెట్టయెదుట
భావములోపలి గుట్టు పైకొన్నదాఁకానే కాక
కైవసమైతివి యిఁకఁ గాదనఁగఁ దగునా
(||pallavi||)
sittamurā nādanigi seda mŏkkave
battiseyam̐gā paṁtamu pasariṁcham̐ dagunā
(||sittamu||)
sĕluvum̐ḍu māḍalāḍī sĕkkuseyi diyyam̐gade
yĕlami nīdalabom̐talim̐ka nem̐ṭige
kaladĕllā nīvidanim̐ gannadām̐kāne kāga
tŏludaḍi suddulim̐kam̐ dŏraliṁcham̐ dagunā
(||sittamu||)
tāne yādam̐ḍu navvīni tappaga sūḍam̐gadave
mānave vaṭṭisiṁtalu mari yem̐ṭige
pūniga livanniyunu pŏṁdinadām̐kāne kāga
kenamulu tŏlliḍivi kĕraliṁcham̐ dagunā
(||sittamu||)
śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ sevalu seyam̐gadave
yeviyum̐ daḍavanela yĕṭṭayĕduḍa
bhāvamulobali guṭṭu paigŏnnadām̐kāne kāga
kaivasamaidivi yim̐kam̐ gādanam̐gam̐ dagunā