చిత్తమురా నాతని సేవలు నేఁ జేసేను
(॥పల్లవి॥)
చిత్తమురా నాతని సేవలు నేఁ జేసేను
కొత్తగాఁ జుట్టరికపు గురుతులు చూపవే
(॥చిత్త॥)
యెంత విన్నాఁ దనివోదు యెలయించీ నాయాసలు
కాంత చెప్పవే యాతనికత లింకాను
దొంతర కోరికెలకు తుదమొదలెంచరాదు
చింతదీర నాతని చేఁత లెఱింగించవే
(॥చిత్త॥)
చూడఁ జూడ వేడుకయ్యీ సుదతి యాతని రూపు
తోడితేవే నీతనిఁ దొయ్యలి నీవు
వాడిక గలుగుచోట వలపు నిలుపరాదు
యేడనున్నాఁ డాతని యిక్కువ దెలుపవే
(॥చిత్త॥)
మనసులోఁ దలఁచితే మర్మములు గరఁగీని
యెనఇంచఁ గదవే మా యిద్దరి పొందు
తనుఁదానే వచ్చికూడె తగ శ్రీవేంకటేశుఁడు
ఘనుఁ డాతనికి నాకుఁ గట్టవే కంకణము
(||pallavi||)
sittamurā nādani sevalu nem̐ jesenu
kŏttagām̐ juṭṭarigabu gurudulu sūbave
(||sitta||)
yĕṁta vinnām̐ danivodu yĕlayiṁchī nāyāsalu
kāṁta sĕppave yādanigada liṁkānu
dŏṁtara korigĕlagu tudamŏdalĕṁcharādu
siṁtadīra nādani sem̐ta lĕṟiṁgiṁchave
(||sitta||)
sūḍam̐ jūḍa veḍugayyī sudadi yādani rūbu
toḍideve nīdanim̐ dŏyyali nīvu
vāḍiga galugusoḍa valabu nilubarādu
yeḍanunnām̐ ḍādani yikkuva dĕlubave
(||sitta||)
manasulom̐ dalam̐side marmamulu garam̐gīni
yĕna̮iṁcham̐ gadave mā yiddari pŏṁdu
tanum̐dāne vachchigūḍĕ taga śhrīveṁkaḍeśhum̐ḍu
ghanum̐ ḍādanigi nāgum̐ gaṭṭave kaṁkaṇamu