చిత్తమునఁ గలయట్టు సేతువు గాని
(॥పల్లవి॥)
చిత్తమునఁ గలయట్టు సేతువు గాని
హత్తి మాకుఁ బని గద్దు అంపవయ్య మమ్మును
(॥చిత్తమున॥)
విన్నపాలు సేయఁ బట్టె వెంటఁ దిరిగాడఁ బట్టె
నిన్నుఁ బొదుగుచు మాకు నేఁ డెల్లాను
కన్నెవద్ది కేఁగ లేదు కలసుద్ది చెప్ప లేదు
అన్న పనులును నాయ నంపవయ్య మమ్నును
(॥చిత్తమున॥)
యిచ్చకాలె ఆడఁ బట్టె యియ్యకోలె సేయఁ బట్టె
నెచ్చెలుల మిదె నీతో నేఁ డెల్లాను
వచ్చేది నెరఁగము వడి రాని దెరఁగము
అచ్చుపడెఁ జేఁత లెల్ల నంపవయ్య మమ్నును
(॥చిత్తమున॥)
తోవ నడవనె పట్టె తోడుక రానె పట్టె
నీవు నేముఁ జేరితిమి నేఁ డెల్లాను
శ్రీవెంకటేశ్వరుఁడ చెలితోడఁ గూడితివి
ఆవల వాకిట నుండే నంపవయ్య మమ్మును
(||pallavi||)
sittamunam̐ galayaṭṭu seduvu gāni
hatti māgum̐ bani gaddu aṁpavayya mammunu
(||sittamuna||)
vinnabālu seyam̐ baṭṭĕ vĕṁṭam̐ dirigāḍam̐ baṭṭĕ
ninnum̐ bŏdugusu māgu nem̐ ḍĕllānu
kannĕvaddi kem̐ga ledu kalasuddi sĕppa ledu
anna panulunu nāya naṁpavayya mamnunu
(||sittamuna||)
yichchagālĕ āḍam̐ baṭṭĕ yiyyagolĕ seyam̐ baṭṭĕ
nĕchchĕlula midĕ nīdo nem̐ ḍĕllānu
vachchedi nĕram̐gamu vaḍi rāni dĕram̐gamu
achchubaḍĕm̐ jem̐ta lĕlla naṁpavayya mamnunu
(||sittamuna||)
tova naḍavanĕ paṭṭĕ toḍuga rānĕ paṭṭĕ
nīvu nemum̐ jeridimi nem̐ ḍĕllānu
śhrīvĕṁkaḍeśhvarum̐ḍa sĕlidoḍam̐ gūḍidivi
āvala vāgiḍa nuṁḍe naṁpavayya mammunu