చిత్తములో తలపోఁత చెప్పితే బయలీఁత
(॥పల్లవి॥)
చిత్తములో తలపోఁత చెప్పితే బయలీఁత
బత్తితోఁ బతికి విన్నపము సేయరే
(॥చిత్త॥)
తలపుఁ నిలుపరాదు తనివి యేమిట లేదు
వలచినవలపులు వసము గాదు
కలువబాణాలు బెట్టు కడునైతి నింతరట్టు
పిలువరే చెలులాల ప్రియుని నీకడలను
(॥చిత్త॥)
అసలు లొలో నిండె అదివో రాయాయ గుండె
రాసికెక్క మోవిపండు రాఁపులఁ బండె
వేసరపుచూపులు విడవు తరితీపులు
యిసుద్దులెల్లా మీతో నేమని చెప్పుదునే
(॥చిత్త॥)
సిగ్గులును వెడ జారె చేఁతలును తుదిమీరె
వెగ్గళపువినుకలి వేడుక చేరె
అగ్గమై శ్రీవేంకటేశుఁడన్నిగాను నన్ను నేలే
యెగ్గులుఁ దప్పులు లేవు యిందరికి ననరే
(||pallavi||)
sittamulo talabom̐ta sĕppide bayalīm̐ta
battidom̐ badigi vinnabamu seyare
(||sitta||)
talabum̐ nilubarādu tanivi yemiḍa ledu
valasinavalabulu vasamu gādu
kaluvabāṇālu bĕṭṭu kaḍunaidi niṁtaraṭṭu
piluvare sĕlulāla priyuni nīgaḍalanu
(||sitta||)
asalu lŏlo niṁḍĕ adivo rāyāya guṁḍĕ
rāsigĕkka movibaṁḍu rām̐pulam̐ baṁḍĕ
vesarabusūbulu viḍavu taridībulu
yisuddulĕllā mīdo nemani sĕppudune
(||sitta||)
siggulunu vĕḍa jārĕ sem̐talunu tudimīrĕ
vĕggaḽabuvinugali veḍuga serĕ
aggamai śhrīveṁkaḍeśhum̐ḍannigānu nannu nele
yĕggulum̐ dappulu levu yiṁdarigi nanare