Sittamulo ramanumdu simtimcheem juvmi

చిత్తములో రమణుఁడు చింతించీఁ జువ్మిూ
Language

(॥పల్లవి॥)
చిత్తములో రమణుఁడు చింతించీఁ జువ్మిూ
యిత్తలఁ దనపై భక్తి యీడేర్చీ ననవే

(॥చిత్తము॥)
వొగిఁ జల్లగాలిఁ దన వూర్పుగా భావింతు
నగవుగాఁ దలఁతు చిన్నారివెన్నెలా
చిగురాకుఁ జూచి మోవిచెలువుగాఁ జింతింతు
మెగుల నా విరహము నొప్పించ దనవే

(॥చిత్తము॥)
కలువలఁ గని తనకన్నులుగా విచారింతు
అలికులములు నెరులని నమ్ముదు
చెలరేఁగి తామెరలు చేతు లని నెడుగుదు
బలు విరహము నన్ను బడలించ దనవే

(॥చిత్తము॥)
సోలి మెఱుఁగులు తనసొంపుగళ లని యెంతు
ఆలించి నాప్రాణము తా నని పోల్తును
యీలీల శ్రీవేంకటేశుఁ డే నలమేల్మంగను
యేలేఁ దొంటివిరహము యేమిఁ జేయ దనవే

(||pallavi||)
sittamulo ramaṇum̐ḍu siṁtiṁchīm̐ juvmiూ
yittalam̐ danabai bhakti yīḍersī nanave

(||sittamu||)
vŏgim̐ jallagālim̐ dana vūrbugā bhāviṁtu
nagavugām̐ dalam̐tu sinnārivĕnnĕlā
sigurāgum̐ jūsi movisĕluvugām̐ jiṁtiṁtu
mĕgula nā virahamu nŏppiṁcha danave

(||sittamu||)
kaluvalam̐ gani tanagannulugā visāriṁtu
aligulamulu nĕrulani nammudu
sĕlarem̐gi tāmĕralu sedu lani nĕḍugudu
balu virahamu nannu baḍaliṁcha danave

(||sittamu||)
soli mĕṟum̐gulu tanasŏṁpugaḽa lani yĕṁtu
āliṁchi nāprāṇamu tā nani poldunu
yīlīla śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelmaṁganu
yelem̐ dŏṁṭivirahamu yemim̐ jeya danave