చిత్తముకొలఁది మరి చెలిభాగ్యము
(॥పల్లవి॥)
చిత్తముకొలఁది మరి చెలిభాగ్యము
హత్తి విన్నవించలేక అండనున్న దానను
(॥చిత్త॥)
కొమ్మతో నీవన్నమాట కొంగుముడి వేసుకొని
ఇమ్ముల నెదురుచూచీ నింటికాడను
రమ్మనఁగా నేమందువో రాజసపు వాఁడవు
వుమ్మడిఁ గానుక యిచ్చి వూరకున్న దానను
(॥చిత్త॥)
కాంతతో నవ్విననవ్వు కట్టికపుసై సేసుక
పంతాన రతుల గోరీఁ బానుపుమీఁద
ఇంతలో కొంగువట్టితే నెట్టుండునో ఘనుఁడవు
అంత నిన్నుఁ గొసరక ఆసల నుందానను
(॥చిత్త॥)
సతికిచ్చిన కాఁగిలి సవరాజ్యము సేసుక
మతిలోనే నిన్నుఁ గూడీ మాటికిమాటికి
రతి సేసితివి నేఁడు రమణి శ్రీ వేంకటేశ
మతకరితనమున మట్టున నుందానను
(||pallavi||)
sittamugŏlam̐di mari sĕlibhāgyamu
hatti vinnaviṁchalega aṁḍanunna dānanu
(||sitta||)
kŏmmado nīvannamāḍa kŏṁgumuḍi vesugŏni
immula nĕdurusūsī niṁṭigāḍanu
rammanam̐gā nemaṁduvo rājasabu vām̐ḍavu
vummaḍim̐ gānuga yichchi vūragunna dānanu
(||sitta||)
kāṁtado navvinanavvu kaṭṭigabusai sesuga
paṁtāna radula gorīm̐ bānubumīm̐da
iṁtalo kŏṁguvaṭṭide nĕṭṭuṁḍuno ghanum̐ḍavu
aṁta ninnum̐ gŏsaraga āsala nuṁdānanu
(||sitta||)
sadigichchina kām̐gili savarājyamu sesuga
madilone ninnum̐ gūḍī māḍigimāḍigi
radi sesidivi nem̐ḍu ramaṇi śhrī veṁkaḍeśha
madagaridanamuna maṭṭuna nuṁdānanu