Sittamu vachchinayattu seyavayya

చిత్తము వచ్చినయట్టు సేయవయ్య
Language

(॥పల్లవి॥)
చిత్తము వచ్చినయట్టు సేయవయ్య
ఇత్తలికి నత్తలికి యెడమాట లేఁటికి

(॥చిత్త॥)
కోపగించుకొనినట్టికొఱత దీరుచుకోను
వైపగాఁ గని ఇంటికి వచ్చితి నేను
ఆపొద్దుననుండి నీవు అట్టె కాచుకుండఁగాను
యేపున నీ వున్న మంచ మెక్కితి నేను

(॥చిత్త॥)
ఆడరానిమాటాడిన ఆనెగులుదీర్చుకోను
వీడెమిచ్చి పాదాలు సేవించితి నేను
వాడుదేరె మోము తోడ వద్ద నే మాటాడఁగాను
వేడుకగందము పూసి వెలసితి నేను

(॥చిత్త॥)
నీరతులలో చేఁతలనేరమెల్లఁ దీరేయట్టు
గానవించి కాఁగిలించి కై కొంటి నేను
యీరీతి శ్రీవేంకటేశ ఇన్నిటా నన్నుఁ గూడితి
మేరతో నీగుణానకు మెచ్చితి నేను

(||pallavi||)
sittamu vachchinayaṭṭu seyavayya
ittaligi nattaligi yĕḍamāḍa lem̐ṭigi

(||sitta||)
kobagiṁchugŏninaṭṭigŏṟada dīrusugonu
vaibagām̐ gani iṁṭigi vachchidi nenu
ābŏddunanuṁḍi nīvu aṭṭĕ kāsuguṁḍam̐gānu
yebuna nī vunna maṁcha mĕkkidi nenu

(||sitta||)
āḍarānimāḍāḍina ānĕguludīrsugonu
vīḍĕmichchi pādālu seviṁchidi nenu
vāḍuderĕ momu toḍa vadda ne māḍāḍam̐gānu
veḍugagaṁdamu pūsi vĕlasidi nenu

(||sitta||)
nīradulalo sem̐talaneramĕllam̐ dīreyaṭṭu
gānaviṁchi kām̐giliṁchi kai kŏṁṭi nenu
yīrīdi śhrīveṁkaḍeśha inniḍā nannum̐ gūḍidi
merado nīguṇānagu mĕchchidi nenu